By: Vijaya Sarathi | Updated at : 08 Feb 2023 10:01 AM (IST)
ప్రభుత్వం విడదల చేసిన మా నమ్మకం నువ్వే జగన్ పోస్టర్
ఏపీలో ఈ నెల 11 నుంచి ఇంటింటికీ జగన్ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టనుంది వైసీపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వాలను ఏదో ఒక రకంగా అందుకునే ప్రతీ ఇంటికీ సీఎం జగన్ ఫోటో ముద్రించి ఉన్న స్టిక్కర్లను అంటించనున్నారు. జగన్ ఫోటోతోపాటు " మా నమ్మకం నువ్వే జగన్ " అనే స్లోగన్‌ను కూడా ఈ స్టిక్కర్ల లో ఉంటుంది . ఈ స్టిక్కర్ల అంటించే కార్యక్రమానికి గ్రామ వాలంటీర్లు, గృహ సారథులను వాడుకోనుంది ప్రభుత్వం. అయితే ఇంటి యజమాని అంగీకరించిన తరువాత మాత్రమే ఈ స్టిక్కర్‌ను అంటిస్తారని వైసీపీ చెబుతోంది. దీని ద్వారా సంక్షేమ పథకాల అమలుపై మరింత స్పష్టమైన వివరాలు ప్రభుత్వానికి లభిస్తాయని అధికార పార్టీ వర్గాలు చెబతున్నాయి.
స్లోగన్ అదిరింది....
" మా నమ్మకం నువ్వే జగన్"
మీ ఇంటికి ఈ లబ్ది చేకూరింది ప్రభుత్వం ద్వారా మీకు ఈ పథకం అందింది అని చెప్పి మరీ స్టిక్కర్ వేస్తాం ..
తప్పుడు హామీలు ఇచ్చి ఎగొట్టి మ్యానిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించుకున్న లుచ్చా భేవకూఫ్ బ్యాచ్ గురించి పట్టించుకునే పని లేదు pic.twitter.com/wOC1zlSb6R — Sri krishna reddy (@krishnareddy083) February 8, 2023
ఓటర్ల నాడి పట్టేందుకు మాత్రమే అంటున్న విపక్షాలు
అయితే, ఈ కార్యక్రమం కేవలం ఓటర్ల నాడి పట్టేందుకు మాత్రమే అంటున్నాయి విపక్షాలు. స్టిక్కర్ల అంటించడం ద్వారా ఎంత మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనేది తెలుసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.
త్వరలోనే " జగనన్న కు చెబుదాం"
జగనన్న స్టిక్కర్లతోపాటు త్వరలోనే ప్రభుత్వం " జగనన్నకు చెబుదాం" అనే క్రొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వైసీపీ చెబుతోంది. దీని ద్వారా ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల ఫీడ్ బ్యాక్‌లను ప్రజల నుంచి డైరెక్ట్‌గా సీఎం జగన్ తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం విధి విధానాలు కూడా మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ చెయ్యనున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో మరిన్ని కార్యక్రమాలను డిజైన్ చేయనుంది ఏపీ సర్కార్ అని సమాచారం .
అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేసి వైసీపీ విజయవంతమైంది. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇలాంటి స్టిక్కర్లను చేసి ఇంటింటికీ ప్రచారం చేసింది. అదే థీమ్‌తో పాటలు కూడా రికార్డు చేసింది. దీనిపై మీమ్స్, షార్ట్స్ చేసి ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే స్టైల్‌లో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2019 రావాలి జగన్ కావాలి జగన్... 2024 మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు.
2019
— MaNoZz`z (@Manojku76881253) February 8, 2023
రావాలి జగన్ కావాలి జగన్
2024
మా నమ్మకం నువ్వే జగన్ pic.twitter.com/plaMkWk1Vc
దీనిపై విపక్షాల నుంచి ట్రోల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అసలు ఈ స్టిక్కర్ల ఖర్చు ఎవరిది... కాంట్రాక్ట్ ఎవరూ అంటూ జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు సామాన్యులు కూడా దీనిపై విమర్సలు చేస్తున్నారు.
మా నమ్మకం నువ్వే జగన్
— PATAN.MD.ALI (@PatanMdSameer24) February 8, 2023
ఏటా ఉద్యోగ కేలండర్ ఇచ్చినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - నిరుద్యోగులు
పరిశ్రమలు ఐటీ కంపెనీలు తెచ్చినందుకు
మా నమ్మకం నువ్వే జగన్- యువకులు
ప్రతి జిల్లాలో ఒక జలప్రాజెక్టులు కట్టినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - రైతులు. pic.twitter.com/Z9kR2fAB9E
Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
AP New Industrial Policy: పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కులు- కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటించిన ఏపీ
తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది