అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP CID News: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో 10 కీలక అంశాలు ఇవే - ఏపీ సీఐడీ చీఫ్ వెల్లడి

ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో గురువారం (సెప్టెంబర్ 14) ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మరోసారి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో గురువారం (సెప్టెంబర్ 14) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ స్కామ్‌లో మొత్తం 10 కీలక​ అంశాలు ఉన్నాయని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. 

నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను విడుదల చేశారని వివరించారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవోకు,అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. అగ్రిమెంట్‌లో జీవో నంబర్‌ను చూపించలేదని గుర్తించారు. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని చెప్పారు. 

‘‘జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు. సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు. రాష్ట్ర మంత్రివర్గం అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు. ఆ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాలోని వంద కోట్లను దోచేశారు. అందులో భాగంగానే రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందని అన్నారు. అలా ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్ల నిధులను డిజైన్ టెక్ కు చెల్లించారు. పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను చంద్రబాబు, అధికారులు పట్టించుకోలేదు’’ అని ఏపీ సీఐడీ చీఫ్ ఆరోపణలు చేశారు.

జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ అయింది. తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేశారు. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదు.. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదు. కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయి. ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయి’’ అని సీఐడీ చీఫ్ ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget