అన్వేషించండి

Revanth Reddy: 10 ఏళ్లు పూర్తవుతున్నా ఏపీకి రాజధాని లేదు, పోలవరం పూర్తికాలేదు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana CM Revanth Reddy: విశాఖలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన 'న్యాయ సాధన సభ’కు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి రాజధాని లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Capital of Andhra Pradesh: విశాఖపట్నం: పదేళ్లు పూర్తి కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు అని, పోలవరం పూర్తవలేదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన 'న్యాయ సాధన సభ’కు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విశాఖలో సభను చూస్తుంటే హైదరాబాద్ లో తమ పార్టీ సభలా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిల నడుం బిగించారని.. ఉక్కు సంకల్పంతో షర్మిల ఈ సభ పెట్టారని కొనియాడారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టేవారే ఆయన వారసులు అవుతారు కానీ అందుకు విరుద్ధంగా నడుచుకునే వారు కాదంటూ ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ వారసులు ఎవరంటే..
విశాఖ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఢిల్లీ నుంచి సుల్తానులు, జాగీర్దార్లు వచ్చినా తెలుగు గడ్డమీద ఒక్క ఇటుక పెళ్ల కూడా తీయలేరు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఏమీ చేయలేరు. వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేవాళ్లే ఆయన వారసులు అవుతారు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా, ఆయన చిరకాల కోరికకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు ఎన్నటికీ దివంగత నేత వారసులు కాలేరు. ఇక్కడ ప్రశ్నించే గొంతులు లేవు. రాష్ట్ర పాలకులు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. గత పాలకులు ఢిల్లీ నేతల్ని, కేంద్రంగా గట్టిగా నిలదీసి ఉంటే అన్నీ సాధించుకునే వాళ్లం. ఢిల్లీని డిమాండ్ చేసి కావాల్సింది సాధించుకునే నాయకత్వం ఇప్పుడు లేదు. మోదీని ఎదిరించే వాళ్లు, ఢిల్లీని ఢీకొట్టే వాల్లు లేకపోవడం వల్లే కేంద్రం నుంచి ఏదీ సాధించుకోలేకపోయాం.

10 ఏళ్లు పూర్తవుతున్నా ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం కూడా పూర్తి కాలేదు. పీవీ, జైపాల్ రెడ్డి లాంటి వాళ్లు ఎన్నో సాధించి దేశ రాజకీయాలను శాసించారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వంగి వంగి నమస్కారం చేసేవాళ్లే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కు 1994లో ప్రతిపక్ష హోదా రాని సమయంలో వైఎస్సార్ చేతికి పగ్గాలు అప్పగించారు’ అని గుర్తుచేశారు.

షర్మిలను ముఖ్యమంత్రిని చేయాలి.. 
వైఎస్సార్ ప్ర‌శ్నించే గొంతుకై పోరాడడంతో 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ు 91కి చేరారని.. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు పాదయాత్రతో 2004లో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. వైఎస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిని చేయ‌డం, అందుకు క‌ష్ట‌ప‌డుతున్న ష‌ర్మిల‌నే వైఎస్సార్ కు నిజ‌మైన వార‌సురాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యాక జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోల‌వ‌రం, హంద్రీనీవా వంటివి ప్రారంభించార‌ు. హైద‌రాబాద్‌లో ఔట‌ర్ రింగురోడ్డు, ఫార్మా ప‌రిశ్ర‌మ‌లతో అభివృద్ధి చేశార‌ని రేవంత్ కొనియాడారు. మ‌ణిపూర్‌లో హింస చోటు చేసుకొని బాధితుల‌పైనే దాడులు చేస్తుంటే వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాజశేఖ‌ర్‌రెడ్డి ఆఖ‌రి వ‌ర‌కు మూడు రంగుల జెండా క‌ప్పుకొన్నార‌ని, ఇప్పుడు ష‌ర్మిల ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. ష‌ర్మిల‌కు మనం అండ‌గా నిలిచి ఆమెను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని, ఏపీకి తాను అండ‌గా నిలుస్తాన‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget