Andhra helicopter issue: పీయూష్ గోయల్‌కు తప్పిన ముప్పు - హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం - నివేదిక కోరిన డీజీపీ
Helicopter: ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో హెలికఫ్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి . ఇది సీఎం కూడా వాడే హెలికాఫ్టర్ కావడంతో నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.

Helicopter Technical issues : ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో హెలికాఫ్టర్ మొరాయించంది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి తరచూ జిల్లాల ప్రమాణాల పర్యటనలకు ఉపయోగించే హెలీకాప్టరును కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఇదే హెలీకాప్టరులో వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే పీయూష్ గోయల్ హలీకాప్టర్ ఎక్కాక సాంకేతిక లోపం బయటపడింది. దీంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వాడే హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు తరుచుగా వాడే హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వీఐపీలు ప్రయాణించే హెలీకాప్టరులో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారుల అలెర్ట్ అయ్యారు. హెలీకాప్టరులో టెక్నికల్, సెక్యూర్టీ ప్రాబ్లమ్స్ పై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ ఆదేశించారు. ఈ హెలీకాప్టరును వినియోగించవచ్చా.. లేదా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశాల్లో పేర్కొన్నారు.
గతంలోనే ప్రస్తుత హెలికాఫ్టర్ పనితీరుపై నివేదికకు కమిటీ
నిజానికి ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్ తరచూ మొరాయిస్తోంది. అద్దె హెలికాఫ్టర్లు, విమానాలను ప్రభుత్వ అవసరాల కోసం అద్దెకు తీసుకుంటూ ఉండటంతో పెద్ద ఎత్తున ఖర్చు అవుతోంది. అందుకే కొత్త హెలికాఫ్టర్ కొనాలనే ప్రతిపాదన గతంలోనే అధికారులు తెచ్చారు. సీఎం తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు వినియోగించేందుకు కొత్త హెలికాఫ్టర్ ను కొనాలని.. ఎలాంటి కొత్త హెలికాఫ్టర్ మోడల్ బాగా ఉపయోగపడుతుందో ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జి ఏ డి పొలిటికల్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుత హెలికాఫ్టర్ పనితీరు, కొత్త హెలికాఫ్టర్ మోడల్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది.
కొత్త హెలికాఫ్టర్ కొనుగోలుకు అధికారులు నిర్ణయం తీసుకునే చాన్స్
ఇలా ఆదేశాలు ఇచ్చారని తెలియడంతో గతంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గార్ల కోసం విలాసవంతమైన హెలికాఫ్టర్‌ను ప్రభుత్వం కొంటున్నారని వైసీపీ విమర్శలు చేసింది. అయితే అదంతా అబద్ధం. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వం పై చేస్తున్న ఫేక్ ప్రచారం అని ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. అయితే హెలికాఫ్టర్ అద్దెలు, ప్త్రత్యేక విమానాల ఖర్చును తగ్గించుకునేందుకు కొత్త హెలికాఫ్టర్ కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత హెలికాఫ్టర్ పనితీరుపై అధికారులు ఇచ్చే నివేదిక కీలకం కానుంది.





















