అన్వేషించండి

3 రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా? - సీఎం జగన్ పై ఎమ్మెల్సీ అనురాధ సెటైర్!

TDP MLC Anuradha: మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ వ్యాఖ్యానించారు.

TDP MLC Anuradha: మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు అన్నారని, త్వరలో తాను విశాఖలో కాపురం పెడతానని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ పై టీడీపీ కామెంట్స్...
శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖ వచ్చి కాపురం ఉంటానని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కాపురం పెట్టాలని మొన్న తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన సందర్భంగా  పొలిటికల్ లాబీయిస్ట్  విజయ్ కుమార్  చెప్పారా అని ఆమె ప్రశ్నించారు. లేదంటే విశాఖ శారదా పీఠం స్వరూపానంద ముహూర్తం పెట్టారా అని అనురాధ ఎద్దేవా చేశారు. రాయలసీమలో కాపురం పెట్టి  ఇడుపులడలపాయలో అసైన్డ్ భూములు కొట్టేశారని, అమరావతిలో కాపురం పెట్టి  రాజధాని రైతులను రోడ్డున పడేశారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూర్తిగా నాశనం చేసి, భూములిచ్చిన రైతులను క్షోభ పెట్టారని, విశాఖ వెళ్లక ముందే ఎంపీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని అక్కడికి పంపి 40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసేశారని ఆరోపించారు. ఋషికొండను బోడిగుండు చేసేసి రేపు సెప్టెంబర్ లో అక్కడ కాపురానికి వెళతారా అని జగన్ ను నిలదీశారు.
మూడు చోట్ల కాపురం పెట్టటమా...
వికేంద్రీకరణ అంటే మూడుచోట్ల కాపురం పెట్టడమా అని ఎమ్మెల్సీ అనురాధ సీఎం జగన్ ను ప్రశ్నించారు.  నాలుగేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, కబ్జాలు మినహా ఏం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్ తన నోటి వెంటే చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఒకవేళ జగన్ చెప్పకపోయినా ప్రజలే చెప్పిస్తారన్నారు.
హత్యకు ఎన్నో అబద్దాలు..
ఒక హత్య- లక్ష అబద్ధాలతో కాలం గడపడం మినహా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేంటని అనురాధ ప్రశ్నించారు. వివేకా హత్య కేసు వెబ్ సిరీస్ ను తలపిస్తోందని, నెట్ ఫ్లెక్స్, జీ 5, ప్రైమ్ కూడా వీరి ముందు దిగదుడుపేనని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో నటన ఆస్కార్ ను మించిపోయిందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, ముందు గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారని గుర్తు చేశారు. గొడ్డలి టీడీపీదని, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని ఆరోపించి, నారాసుర రక్తచరిత్ర పేరుతో పుస్తకాలు వేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బయటకు రావాలన్నారు. విపక్షంలో సీబీఐ విచారణ కావాలన్న జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదనటంపై ప్రశ్నించారు. వివేకా హత్యలో ఆయన కూతురు సునీత హస్తం ఉందని, వివేకా రెండో భార్యే హత్య చేయించిందని, సునీల్ యాదవ్ తల్లికి, వివేకాకు సంబంధం ఉందని రకరాలుగా ప్రచారాలు చేయటం దారుణం అన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో ఉన్నారని, వివేకానంద రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో ఆయన్ను పొగిడి, ఇప్పుడేమో ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ అసెంబ్లీలో నంగనాచి కబుర్లు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు భయపడున్నారని అన్నారు. హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, జగన్ రెడ్డి అనుమతి లేకుండా హత్య సాధ్యమా అని పేర్కొన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేస్తారా... చెల్లి భర్త పై హత్యానేరం మోపిన జగన్ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పిస్తారా అని ప్రశ్నించారు. కుటుంబసభ్యులనే దారుణంగా మోసం చేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్యుల పరిస్థితేంటన్నారు. హత్య చేయలేదని చెబుతున్న అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచినట్టో చెప్పాలన్నారు. సునీతకు న్యాయం జరుగుతుందని, కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని అనురాధ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget