అన్వేషించండి

AP Fake Votes: ఏపీ ఓటర్ జాబితాలో అవకతవకలు- ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు

Andhra Politics: ఏపీలో కొన్నిచోట్ల డబుల్ ఓట్లు ఉండగా, పలు చోట్ల చనిపోయిన వారి పేరిట సైతం ఓట్లు ఇంకా తొలగించలేదని టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

TDP Complaints over Fake Votes in Andhra Pradesh: అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఓటర్ జాబితా (AP Voter List)లో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని ఎలక్షన్ కమిషన్‌ (Election Commission)కు ఓ లేఖ రాశారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయని, ఎప్పుడో మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఇంకా తొలగించలేదు అని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నిచోట్ల మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయని ఈసీకి తెలిపారు.

పలుచోట్ల ఒకే డోర్ నెంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని, తక్షణమే వెరిఫై చేసి దొంగ ఓట్లు, నకిలీ ఓట్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఒకే ఓటు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులు సైతం ఉన్నారని.. మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారని ఈసీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. దొంగ ఓట్ల వివరాలు, అందుకు సంబంధించిన వివరాలను జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలను షరీఫ్ సమర్పించారు.
ఏపీలో ఓటర్ జాబితా తప్పిదాలపై సాక్ష్యాధారాలు, వార్తా కథనాలను ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషన్‌కు రిక్వెస్ట్ చేశారు. ఇదివరకే టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల బృందాలు ఢిల్లీకి వెళ్లి ఎన్నికల ప్రధానాధికారిని కలిశాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు దొంగ ఓట్ల విషయంపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ సైతం ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయని వాదిస్తోంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, సాధ్యమైనంత త్వరగా దొంగ ఓట్లను, చెల్లని ఓట్లను తుది ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Virat Kohli : విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
విరాట్ కోహ్లీ శతకంతో చరిత్ర! 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు
Embed widget