Jagan Vs TDP : గెలిస్తే ఈవీఎంలు మంచివి ఓడిపోతే చెడ్డవా - ఏపీ ఎలన్ మస్క్ జగన్ - టీడీపీ విమర్శలు
YSRCP News : ఈవీఎంలపై జగన్ ఆరోపణలను టీడీపీ ఖండించింది. గెలిచినప్పుడు మంచివి.. ఓడిపోతే చెడ్డవా అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Andhra Politics : ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై తెలుగుశం పార్టీ మండిపడింది. ఈవీఎంలు అద్భుతంగా పని చేస్తాయని వాటిలో లోపాల్లేవని ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ పార్టీ నేతలుకూడా ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఈవీఎంలను సమర్థిస్తూ జగన్ మాట్లాడిన వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.
Let’s face it @ysjagan, you’re allergic to democracy. You systematically destroyed institutions, systems and practices devoted to protecting people’s rights. You struck down in one stroke what the people of AP built collectively over the years.
— Lokesh Nara (@naralokesh) June 18, 2024
When you won in 2019, EVMs worked… https://t.co/JMsxb4zVKg pic.twitter.com/uFnOXIhfdM
.@ysjagan ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు..గెలిస్తే తన గొప్ప..ఓడితే ఈవీఎంల తప్పా..?
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) June 18, 2024
2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి.. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. https://t.co/Tpz7dqRv43
2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొన్ని పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాయి. అయితే అప్పుడు ఈవీఎంలను జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. ఇప్పుడు ఓడిపోవడంతో ఆయన ఈవీఎంలను తప్పు పడుతూండటంతో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తె evm లు గురించి మాట్లాడుతున్నావు...
— Budda Venkanna (@BuddaVenkanna) June 18, 2024
ఒకపని చేద్దాం.. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్యి.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టమని అందరం కలిసి ఎలెక్షన్ కమిషన్ ను కొరదాం.. నీకు ఈసారి మొన్న వచ్చిన… https://t.co/yWzh1jDCS8