అన్వేషించండి

Tadipatri News :తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు, ఉద్రిక్తతల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ

Tadipatri News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి భూమి పూజ చేశారు. ఈ భవనానికి మున్సిపల్ శాఖ అనుమతి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Tadipatri News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఖాళీ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భూమి పూజ చేశారు. దీంతో తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది.తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ అనుమతి లేదని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో నిరసనకు దిగారు. అన్ని అనుమతులు తీసుకునే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు అంటున్నారు. వైసీపీ, టీడీపీ నాయకుల ప్రకటనల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఫకీరప్పతోపాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య హాజరయ్యారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  తాడిపత్రిలో నియంత పాలన కొనసాగుతోందని చిన్న భవనం నిర్మించాలన్న మున్సిపల్ అనుమతి తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతి తీసుకోకుండా ఎలా నిర్మిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్య తాడిపత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

మాటల యుద్ధం  

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే ఎస్పీతో కలిసి గురువారం భూమి పూజ నిర్వహించారు. అయితే మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారని, తనకు చెప్పకుండా భూమి పూజ చేయడం ఏంటని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖకు చెందిన స్థలమని, అన్ని అనుమతులు తీసుకున్నామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. పోలీసులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఆరోపణలు పట్టించుకోవడంలేదు. భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ స్థలాలను జేసీ కుటుంబీకులే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. తాడిపత్రి ఆయన జాగిర్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ 

తాడిపత్రిలో  డీఎస్పీ చైతన్య వ్యవహారశైలిపై మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పోరుబాట పట్టారు. ఆయన ప్రోద్భలంతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, దళిత నేతల్ని టార్గెట్ చేశారని ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి కేసుకైనా రూ. లక్ష తీసుకుంటారని డీఎస్పీపై మండిపడ్డారు. డీఎస్పీ చైతన్య కూడా రాజకీయ పరమైన ఆరోపణలు చేయడంతో పరిస్థితి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ చైతన్య అన్నట్లుగా మారింది. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఉన్నతాధికారుల అనుమతితో తాను కోర్టును ఆశ్రయిస్తాయని డీఎస్పీ ప్రకటించారు. ఈ మాటల మంటలు ఇలా ఉండగానే పోలీసుల తీరుకు నిరసనగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి సేవ్ తాడిపత్రి నినాదంతో ఇటీవల నిరసన చేశారు. 

రాజకీయ వేధింపులు 

రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే నియోజకవర్గం తాడిపత్రి. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు దళిత కౌన్సిలర్లపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో డీఎస్పీ చైతన్య ప్రమేయం ఉందని ఆ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇటీవలి కాలంలో డీఎస్పీ చైతన్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని, టీడీపీ నేతల్ని రాజకీయంగా వేధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించి స్టేషన్‌ ముందు ధర్నాకు దిగడంతో కొన్ని గంటలపాటు హైటెన్షన్‌ కొనసాగింది. ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget