(Source: Poll of Polls)
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. జిల్లాల పర్యటనలు రద్దు చేసుకున్న ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే ఉన్నారు.
Jagan To Delhi : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల పర్యటనలు రద్దయ్యాయి. ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని అందుకే టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారన్న సమాచారం వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారికంాగ టూర్ల క్యాన్సిల్ కు కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. అనుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లలేదు. కానీ ఢిల్లీ పర్యటన మాత్రం ఖచ్చితంగా ఉందని.. ఆది ఆది వారం లేదా సోమవారం వెళ్లవచ్చని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు ఏపీ సీఎం ఏర్పాట్లు !
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఢిల్లి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో టూర్లు ప్లాన్ చేసుకున్నారు. శనివారం విశాఖ పర్యటనను కూడా అర్ధాంత రంగా రద్దుచేసుకు న్నట్లు- రాత్రి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీంతో సీఎం జగన్ ఈ రెండు టూర్లు ఇంత అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకు న్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నా యి. ఈ రెండు టూర్లు రద్దు చేసు కున్న సీఎం జగన్ శుక్రవారం ఉదయం మాత్రం క్యాంపు కార్యాలయం లో ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. దీంతో మధ్యా హ్నం నుంచి జగన్ ఢిల్లీ పయనం అవుతారని ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఆయన తాడేపల్లిలోనే ఉండిపోయారు. ఇదే క్రమంలో శనివారం ఆయన విశాఖ పర్యటన కూడా రద్దయి నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు సమాచారం అందింది. దీంతో ఆయన శివనివారం ఢిల్లీ వెళ్తారని అనుకున్నారు. కానీ శివారం కూడా ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే ఉన్నారు.
ఢిల్లీ పర్యటన ఎందు కోసం ?
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లి పర్యటన చేపట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ముందస్తుకు సంకేతాలు కనిపిస్తున్నతరుణంలో పలు అంశాలపై సీఎం జగన్ ప్రధాని నుండి స్పష్టమైన హామీ కోసం గతంలో వెళ్లిన పర్యటనకు కొనసాగింపు గానే ఈసారి వెళ్లబోతున్నారని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లి పర్యటన ఇప్పుడెందుకనేదానిపై పూర్తిస్థాయి లో స్పష్టత లేదు. కానీ, పలు కీలక అంశా లపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తోం ది. మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఖరారైతే ఎప్పుడైనా బయలుదేరవచ్చని చెబుతున్నారు.
ఆర్థిక సమర్యలు తీరాలంటే కేంద్రం సహకారం తప్పని సరి !
రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. అవి తీరాలంటే తప్పనిసరిగా కేంద్రం సహకారం అవసరం. ఇంకా రెండు నెలలు గడవాల్సి ఉంది. అప్పుల పరిమితి అంతా ముగిసిపోయింది. పలు రుణాల తిరుగు చెల్లింపులు పెండింగ్ ఉండిపోయాయి. వీటన్నిటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు ఉన్నతాధికారులు వెళ్లి .. పరిస్థితిని చక్కదిద్దేవారు. కానీ ఈ మధ్య జగనే స్వయంగా ఢిల్లీ వెళ్లి నేరుగా ప్రధానిని కలుస్తున్నారు. ఆ తర్వాత కొంత ఊరట లభిస్తోది. ఈ కోణంలోనూ ఆయన ఢిల్లీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.