![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TTD Supreme Court : శ్రీవారి పూజల్లో లోపాలంటూ పిటిషన్ -సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు !
పూజాధికాల విషయంలో టీటీడీ తప్పులు చేస్తే శ్రీవెంకటేశ్వరుడు క్షమించరని సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజాధికాలు నిర్వహించలేదంటూ ఓ భక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు
![TTD Supreme Court : శ్రీవారి పూజల్లో లోపాలంటూ పిటిషన్ -సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు ! Supreme Court Seeks Tirupathi Tirumala Devasthanam's Response To Devotee's Plea Alleging Irregularities In Rituals TTD Supreme Court : శ్రీవారి పూజల్లో లోపాలంటూ పిటిషన్ -సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/29/7acae6a559dc58d4339de0ad41e6e5fd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదని కూడా పేర్కొన్నారు. పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. వెంటనే కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ బెంచ్‌ను కోరారు. అయితే ఈ అంశంపై చీఫ్ జస్టిస్ పిటిషనర్‌తో తెలుగులో మాట్లాడారు. టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరినీ ఉపేక్షించరని వ్యాఖ్యానించారు.
Also Read : అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు..
" మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఓపిగ్గా ఉండాలి. ప్రతి రోజూ పిటీషన్‌ను లిస్ట్ చేయమని రిజిస్ట్రీపై ఒత్తిడి తీసుకురాకూడదు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా బాలాజీ భక్తులమే''నని చెప్పారు. పిటీషన్‌ను వచ్చే బుధవారం లిస్ట్ చేస్తూ.. ఫిర్యాదుపై స్పందించాలని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఆదేశించారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో కొట్టి వేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్‌లో హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై అప్పట్లో విచారణ జరిగింది. విచారణలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోలేదని.. ఇది తమ పరిధి కాదని అభిప్రాయపడింది. ఆలయంలో జరిగే పూజల ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోలేరని వ్యాఖ్యానించింది.
Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్
ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమలలో కైంకర్యాలు జరపడంతో పాటు హిందూయేతరుల నుంచి డిక్లరేషన్ తీసుకునేలా టీటీడీని ఆదేశించాలని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా కోర్టుల్లో పిటిషన్ లు వేస్తున్నారు. పూజాది, ఆర్జితోత్సవాల తీరు సరిగా ఉండటం లేదని పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతున్నారు. హైకోర్టులో జరిగిన విచారణలో టీటీడీ కమిటీ పూజాదికాల్లోకి జోక్యం చేసుకోదదని తెలిపారు. పురాణాల ప్రకారం స్వామివా రు కొన్ని లక్షల ఏళ్ల క్రితమే అక్కడకు వచ్చారని... అక్కడ పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలో ఆయనే నిర్ణయించారని.. వైఖానస మహర్షి వీటిని గ్రంథాల్లో పొందుపరిచారని ... ఏ కమిటీ వచ్చినా శాస్త్ర ప్రకారం పూజలు జరగాల్సిందేనన్నారు. పిటిషనర్ చెబుతున్నట్లుగా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని వాదించారు. విచారణ తర్వాత పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
Also Read: TTD Board : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
ఇప్పుడు ఆ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పూజలు ఎలా చేస్తారన్న విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే వివరాలు సమర్పించాలని టీటీడీని కోరింది. తుదపరి విచారణ అక్టోబర్ ఆరో తేదీన జరగనుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)