అన్వేషించండి

ఫైబర్ నెట్ కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అటు స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు 19కి వాయిదా వేసింది.

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 20న (శుక్రవారం) దీనిపై విచారిస్తామని సుప్రీం తెలిపింది. అంత వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సర్వోన్నత న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. 

హైకోర్టులోనూ వాయిదా

మరోవైపు, స్కిల్ స్కాం కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా, తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. అలాగే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.

ఇదీ ఫైబర్ నెట్ కేసు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ టెండరును టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది.

ములాఖత్ ల విషయంలోనూ

మరో వైపు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. ఆయన ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే జైలు అధికారులు ఇలా చేసినట్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని, దీనిపై ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు ములాఖత్ ల అంశంపై టీడీపీ ముఖ్య నేతలు జైళ్ల శాఖ డీఐజీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ములాఖత్ లు ఎప్పటిలానే ఉండేలా చూడాలని అభ్యర్థించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget