News
News
X

Summer Health Tips: వడదెబ్బ లక్షణాలివే - ఎండతీవ్రతకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్

Summer Tips SunStroke: వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

FOLLOW US: 
Share:

Summer Tips SunStroke:  ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చింది. మార్చి నెలలో ఇదివరకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటయకు వెళ్లకపోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే గొడుగు తీసుకుని బయటకు వెళ్లాలని, సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు, పళ్ల రసాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అయితే వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

వడదెబ్బ లక్షణాలు:
తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.

ఎండతీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-
- స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి.
- నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు  గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
- వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.
- ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగవచ్చును.
- వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.
- ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని , నిమ్మరసముగాని, కొబ్బరినీరు గాని తాగాలి.
- తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించండి.
- ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీటితో స్నానం చేయండి.
- తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.
- మేడపైన మొక్కలు, ఇంట్లో ని  మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.

ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి :-
X  ఎండలో  గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో  నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
X  మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.
X  బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు.  వీరిపై ఎండ ప్రభావం త్వరగా  చూపే అవకాశం ఉంది.
X  శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోవాలి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే  పదార్దాలను తీసుకోవద్దు. 
X  ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.
X  ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకోకూడదు.
X  శీతలపానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము పాలవుతారు.
X  ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు మరియు కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోండి.
X  వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడంలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.

Published at : 08 Mar 2023 09:52 PM (IST) Tags: AP News Summer tips Summer Sunstroke Sun Stroke Summer Case

సంబంధిత కథనాలు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌