Pawan Kalyan : మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల సీఎం- మీ నాన్ననే ఎదుర్కొన్నా నువ్వెంత - పవన్ కల్యాణ్
Pawan Kalyan : విభజనతో ముక్కలైన రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేసేందుకు కుట్ర జరుగుతుందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
Pawan Kalyan : ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోవద్దని, ప్రజలే ప్రశ్నించాలని, ప్రజల కోసం నిలబడే వాళ్ల కోసం నిలబడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. సినిమాలు సక్సెస్ అయి ఆనందంలో ఉన్నా సామాన్యుల కష్టం తనను సంతోషంగా ఉండనివ్వలేదని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రమంతా సమస్యలమయం అయిందన్నారు. పోలవరం, ఉద్యోగులకు జీతాలు, బూతులు తిట్టే మంత్రులు ఇలా పూర్తిగా సమస్యల్లో మునిగిపోయిందన్నారు. విభజన జరిగిన రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేసే కుట్ర చేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వమన్నారు. మూడు ముక్కల సీఎం అని పవన్ మండిపడ్డారు.
చివరి శ్వాస వరకూ రాజకీయాల్లో
"ఉత్తరాంధ్ర పోరాట గడ్డ. ఇది కళింగ ఆంధ్ర కాదు తిరగబడే ఆంధ్ర. ఎందుకు వలస వెళ్లాలని మీరు ప్రశ్నించాలి. నాకు ఈ పోరాటంలో స్పూర్తినిచ్చింది గిడుగు రామ్మూర్తి పంతులు. వాడుక భాషలోనే రాయాలని పోరాడారు గిడుగు రామ్మూర్తి. ఆశయం ఉన్న వాళ్లు ఇతరుల విమర్శలు పట్టించుకున్నారు. కోటి జనాభా ఉన్న ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం వలసలు వెళ్లిపోయారు. నేను మీకోసం బలంగా నిలబడ్డాను. కానీ చట్టసభల్లో ప్రశ్నించే సత్తా నాకివ్వలేదు. అయినా నేను బాధపడలేదు. రెండు చోట్ల ఓడిపోయావని నన్ను విమర్శించినా మీ కోసం నేను నిలబడ్డాను. ఈ రణస్థలంలో మాటిస్తున్నాను. నా చివరి శ్వాసవరకూ రాజకీయాల్ని వదలను, మిమల్ని వదలను." -పవన్ కల్యాణ్
డీజీపీ సెల్యూట్ చేస్తుంది 6093 ఖైదీకి
"ఉన్నత విలువలున్న వ్యక్తులు నన్ను విమర్శిస్తే బాధపడతాను. కానీ జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 నన్ను విమర్శిస్తే నేను బాధపడను. డీజీపీ కూడా సెల్యూట్ కొడుతుంది 6093 ఖైదీ. నా మీద ఇంటెలిజెన్స్ పెట్టడం ఎందుకు వేస్ట్. మీకు ఏంకావాలో అడిగితే నేనే బహిరంగ సభలో చెబుతాను. నేను అన్నింటికీ తెగించి రాజకీయాల్లో వచ్చాను. నేను ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. వలసలు ఆపుతాను. పరిశ్రమలు తీసుకొస్తాను. నేను ఒక తరాన్ని మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంత ట్యాక్స్ కడుతున్న నేను డబ్బులు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఈసారి ఎవరైనా నేను డబ్బులు తీసుకున్నానంటే మీరే చెప్పులతో కొట్టండి. మీరు జనసేనకు అండగా ఉంటే అభివృద్ధి సాధించుకుందాం. మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. నాకు అధికారం ఇస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకోస్తాను." -పవన్ కల్యాణ్
సజ్జల సలహాదారు అయితే పూర్తిగా నాశనం
"ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు. మీరు నా పక్షాన నిలబడితే దోషులకు శిక్ష పడేలా నేను చేస్తాను. చనిపోయిన విద్యార్థి తల్లి మంత్రి దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని అడిగితే ఎటకారంగా ఏంటమ్మా నేనేమైనా నీకు బాకీ ఉన్నావా అని మాట్లాడారంట. ఏంచేయాలి వీళ్లను ఇంకోసారి గెలిపిస్తారా? సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనం అవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంత ఇది వైసీపీ సొంతం కాదు. మనం ఇప్పటికైనా మేల్కొకపోతే, జనసేనకు అండగా ఉండకపోతే మీ జీవితాలు ఇలానే ఉండిపోతాయి. మీ కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా నువ్వెంత, మూడుముక్కల సీఎం. పంచలూడదీసి కొడ్తా అని చెప్పా. నేను ఎవరికీ బయపడాను. సంబరాల రాంబాబు, అటిన్ రోజాలు కూడా విమర్శలు చేస్తున్నారు. అన్ని కులాలూ బాగుంటాలనేదే నా లక్ష్యం. ఖైదీ నెంబర్ 6093 నా గురించి మాట్లాడితే ఎట్లా? డీజీపీ ఒక ఖైదీకి సెల్యూట్ చేస్తున్నారు. " - పవన్ కల్యాణ్