By: ABP Desam | Updated at : 09 Jan 2022 07:49 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి సీదిరి అప్పలరాజు(ఫైల్ ఫొటో)
కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు అవాస్తవాలే మాట్లాడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడం అన్యాయంగా ఉందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వైసీపీ అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి వారిలో మనోస్థైర్యం కల్పించిందన్నారు. రైతు భరోసా కేంద్రం ఆలోచన దేశం మొత్తం అమలు చేయాల్సిన విప్లవాత్మక మార్పు అని నీతి అయోగ్ చెప్పిందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు గతంలో మాదిరిగా లేరన్నారు.
Also Read: లైంగిక వేధింపులు వర్సెస్ చికెన్ పకోడా ... ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో రచ్చ రచ్చ
సచివాలయ ఉద్యోగులు మాట్లాడే ముందు ఆలోచించుకోండి : మంత్రి
'ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి. చంద్రబాబు ఇది రాసి పెట్టుకోవాలి. సచివాలయాల ఏర్పాటుతో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నాం. జాబ్ చార్ట్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఇవన్నీ కనిపించట్లేదా?. చంద్రబాబుకు ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రభుత్వం చికెన్, చేపలు అమ్ముతోందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. చేపల విక్రయ రంగంలో ఉన్న వారు నిలదొక్కుకోవాలని వారికి సబ్సిడీ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో విక్రయాలు జరిగేలా ఔట్ లెట్స్ పెట్టి ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేస్తున్న యజ్ఞం ఇది. సచివాలయ ఉద్యోగులు మాట్లాడేముందు ఆలోచించుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ళపాటు ప్రొబేషన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. జూన్ నాటికి ప్రొబేషన్ ప్రకటించాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఇందులో వివాదం ఏముంది? చంద్రబాబు తొత్తులు అన్ని రంగాల్లో ఉన్నారు. అలాంటి వారు చేసే వ్యాఖ్యలను పట్టుకుని పెద్ద ఉద్యమం లాగా చిత్రీకరించి చూపించాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ అనేది జగన్ మానసపుత్రిక లాంటిది. దానిపై జగన్ కు అపారమైన నమ్మకం ఉంది.' అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
గత వారం రోజులుగా విశాఖ తీరంలో నెలకొన్న రింగు వలల వివాదానికి ముగింపు పలకడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆదివారం విశాఖ కలెక్టరేట్ లో ఇంఛార్జ్ మంత్రి కన్నబాబు, సీదిరి అప్పల రాజు, ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర అధికారులు మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై ఒక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20లోపు దీనిపై ఒక శాశ్వత పరిష్కారం సూచిస్తామని మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో ఉన్న కర్ఫ్యూ ను ఎత్తివేస్తున్నట్టు మంత్రులు మత్స్యకారులకు తెలిపారు. రేపటి నుంచి నిబంధనల ప్రకారం వేట చేసుకోవచ్చన్నారు.
Also Read: అది చూసి చంద్రబాబు కళ్లు కిందికి జారిపోయాయ్, బాబుకు ఆ ఆలోచన వచ్చిందా? ఎమ్మెల్యే రోజా సెటైర్లు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు