అన్వేషించండి

CM Jagan : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, ప్రతి కమతానికి యూనిక్ ఐడెంటిటీ నంబర్- సీఎం జగన్

CM Jagan : సమగ్ర భూ సర్వే చేపట్టి రైతులకు భూహక్కు పత్రాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 2023 చివరి నాటికి సర్వే పూర్తి చేస్తామన్నారు.

CM Jagan : ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపణీ కార్యక్రమం చేపట్టంది ప్రభుత్వం. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 'జగనన్న భూహక్కు- భూరక్ష' పథకం రెండో దశను సీఎం జగన్ ప్రారంభించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతో భూముల సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయమంటే జవాబుదారీతనమన్న సీఎం జగన్... ప్రజలకు మంచి చేస్తేనే ఆదరిస్తారని మర్చిపోకూడదని సీఎం జగన్ అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానన్నారు. మీ ఇంటిలో మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండని సీఎం జగన్‌ కోరారు.  

2023 చివరి భూ సర్వే పూర్తి 

 2023 చివరి నాటికి రాష్ట్రమంతటా భూ సమగ్ర సర్వే పూర్తిచేస్తామని సీఎం జగన్ తెలిపారు. భూవివాదాల్లో ఎక్కువ సివిల్‌ కేసులే అన్న సీఎం జగన్... సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆ పరిస్థితులను మార్చాలని సర్వే చేపట్టామన్నారు. రాష్ట్రం మొత్తం భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌ చేశామన్నారు. ప్రతి కమతానికి గుర్తింపు సంఖ్య ఇస్తామన్నారు. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో భూసర్వే చేపడుతున్నామన్నారు. 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెండేళ్ల కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశామన్నారు. ఇప్పటి వరకూ 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందజేశామని తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామన్న సీఎం జగన్... మే 2023 కల్లా 6 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు, ఆగస్ట్‌ 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.

మామ పార్టీ కబ్జా 

తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని సీఎం జగన్ అన్నారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని ఆరోపించారు. మోసం చేసే చంద్రబాబులాంటి వ్యక్తులు మళ్లీ అధికారం రాకూడదన్నారు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడంటారని, పరాయి స్త్రీ మీద కన్నేసి అపహరిస్తే రావణుడు అంటారన్నారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నామన్నారు. దుర్యోధనుడులాంటి చంద్రబాబును సమర్థించే వారిని దుష్టచతుష్టయం అంటారని విమర్శించారు. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.  

పాలనలో విప్లవాత్మక మార్పులు 

వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలన వ్యవస్థల్లో సంచలన మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుకు పెంచామన్నారు. కుప్పం సహా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలుంటే ఇప్పుడు మరో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తు్న్నామని వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget