అన్వేషించండి

SP Rishant Reddy : పుంగనూరులో ప్రీప్లాన్డ్ దాడులు - ఎంత పెద్ద వాళ్లున్నా వదిలి పెట్టబోమన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి !

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల్నిచంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకటించారు.


SP Rishant Reddy :  పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకటన చేశారు. పుంగనూరులో జరిగిన రాళ్ల దాడుల ఘటనల్లో ఇరవై మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. ఇందులో డీఎస్పీ కూడా గాయపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.    
 
ఆ తర్వాత చంద్రబాబునాయుడు అక్కడి నుంచి అంగళ్లు గ్రామానికి వస్తున్నప్పుడు .. తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అంగళ్లు గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడానికే ఇలా వైసీపీ కార్యకర్తలు రోడ్డును బ్లాక్ చేశారన్నారు. ఇలా చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. తెలిపారు. అంగళ్లు గ్రామానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టారని ఎస్పీ తెలిపారు. 

వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మీద.. పోలీసుల మద దాడులు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారన్నారు. అలాగే డీఎస్పీని అవమనించేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పై రాళ్లు దాడులు చేశారన్నారు. అప్పుడు చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ దాడుల కారణంగా.. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడంతో చంద్రబాబును కాన్వాయ్ ను పుంగనూరు కు వెళ్లకుండా..  రోడ్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేసి.. దారి మళ్లించామని ..బైపాస్ రోడ్ మీదుగా రోడ్ షాను రూట్ మార్చామన్నారు. అయితే అప్పటికే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు.. పోలీసుల మీద దాడి చేశారని రిషాంత్ రెడ్డి తెలిపారు. 

టీడీపీ కార్యకర్తల దాడిలో రెండు పోలీసు వాహాలు తగలబబడిపోయాయనని తెలిపారు. ఇందులో ఒక బస్సు, ఒక  వజ్ర వాహనం ఉందన్నారు. ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. దాడులు చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించామని.. అయినా పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. 

ఉద్రిక్తతల కారణంగా చంద్రబాబును పుంగనూరులోకి రాకుండా అడ్డుకున్నమని.. అందుకే పోలీసులపై దాడులు చేశారన్నారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని ఎస్పీ చెప్పారు. పోలీసులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేశారని ..ఈ ఘటనలో  ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలి పెట్టేది లేదని ఆయన ప్రకటించారు.                     

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget