అన్వేషించండి

SCR: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవి సెలవులు, ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

Special Trains: ఉగాది సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ - హుబ్బళ్లి - విజయవాడ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

South Central Railway Special Trains For Ugadi: ఉగాది పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ - హుబ్బళ్లి - విజయవాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడిపించినున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10న (బుధవారం) విజయవాడ - హుబ్బళ్లి (07001) మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ నెల 11న హుబ్బళ్లి - విజయవాడ (07002) మధ్య కూడా ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఇరుమార్గాల్లో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, బళ్లారి, తోరనగల్లు, హోసేపేట జంక్షన్, మునిరాబాద్, కొప్పాల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ముఖ్యంగా విజయవాడ ఈ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వేసవి సెలవుల నేపథ్యంలో

అటు, వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి, నాగర్ సోల్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే, తిరుపతి, మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు (07517) బయలుదేరుతాయి. మరుసటి ఉదయం 8 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటాయి. నాగర్ సోల్ నుంచి ఏప్రిల్ 18. 25.. మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 10:50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించింది.

తిరుపతి - మచిలీపట్నం మధ్య

తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read: TDP News: సిట్ ఆఫీసు వద్ద కీలక ఫైల్స్ దగ్ధం! అవి చంద్రబాబు అక్రమ కేసుల పత్రాలేనా?

టాప్ హెడ్ లైన్స్

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget