By: ABP Desam | Updated at : 13 Jan 2022 05:21 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే.. 8 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. జనవరి 14న నర్సాపూర్-విజయవాడ డెమూ, 13న విజయవాడ- నర్సాపూర్ డెమూ, మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 13న విజయవాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ప్రత్యేక బస్సులు
జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు.. వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
హైదరాబాద్ ఎంజీబీస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్ఆర్నగర్, అమీర్పేట, టెలిఫోన్భవన్, దిల్సుఖ్నగర్ నుంచి బస్సులు నడపనున్నారు. అంతేగాకుండా.. జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో ముఖ్యమైన స్టాపుల నుంచి బస్సులు ఉండనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం..
సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.
Also Read: Tollywood Jagan : " టాలీవుడ్ రియాక్షన్ " ఆపడమే అసలు వ్యూహం ! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా ?
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
3 Years of YSR Congress Party Rule : మూడు రాజధానులు టు రివర్స్ టెండరింగ్ - మూడేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ !
3 Years of YS Jagan's Rule : ప్రజల ఖాతాల్లో నగదు - ప్రజల వద్దకు పాలన ! మూడేళ్ల జగన్ పాలనలో మెరుపులు ఇవే
Achenna On Konaseema : అల్లర్ల వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర - ఫోటోలు విడుదల చేసిన అచ్చెన్నాయుడు !
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Baramulla Encounter: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?