Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
MLC Somu Veerraju: కమ్యూనిస్టులపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకపోయినా దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

Somu Veerraju fires at communists: బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కమ్యూనిస్టులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. భీమిలిలో బిజెపి పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కమ్యూనిస్టు పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కమ్యూనిస్టులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, దేశాభివృద్ధికి వారు ఆటంకమని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం రాజకీయ ఉనికి కోసమే కమ్యూనిస్టు నేతలు నిరాహార దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు మేత అందకనే ఇలాంటి దీక్షలు చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
విశాఖ:
— Vizag News Man (@VizagNewsman) April 6, 2026
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్ లను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదస్పద వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయకపోయినా, కమ్యూనిస్టులకు మేత అందక నిరహార దీక్ష లు చేస్తున్నారు
కమ్యునిష్టులు కంట్రీకి నీచులు pic.twitter.com/Pwo1vMKraN
కమ్యూనిస్టులు దేశానికి నీచులు అంటూ ఆయన వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలో కూడా వారు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకున్నారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంటే, వీరు మాత్రం పనిగట్టుకుని బీజేపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
భీమిలి, విశాఖపట్నం జిల్లా
— SOMU VEERRAJU / సోము వీర్రాజు (@somuveerraju) April 6, 2026
విశాఖపట్నం జిల్లా పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి భీమిలిలో నూతనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది.
ఉత్సాహభరితమైన కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి కొత్త ఊపును అందించింది. ప్రతి గ్రామంలో… pic.twitter.com/fVil3ZBgWy
భీమిలి వేదికగా సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అవమానించడమే కాకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి భాష వాడటం సరికాదని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటాన్ని అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
Before You Go
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















