అన్వేషించండి

Satyasai News : గుండు చేయించుకున్నారని టీచర్ సస్పెన్షన్ - అంత మాత్రానికే కాదు అసలు కథ చాలా ఉంది !

దేవుడికి తలనీలాలు ఇస్తే మాత్రం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా ? ఆ టీచర్‌ను సస్పెండ్ చేసేశారు ఏపీ అధికారులు. ఇంతకూ ఆయనేం చేశారంటే ?

Anantapuram News :  శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సి పాలిటీ పరిధిలోని మేళాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్ఎఎన్ ఆదినారాయణను అధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి కారణం దైవ దర్శనానికి వెళ్లిన తాను మొక్కులు చెల్లించుకున్నానని .. తలనీలాలు సమర్పించుకుని విధులకు హాజరైతే ఫేషియల్ రికగ్నైషన్ యాప్‌లో గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. అదే ఆయనకు ఇబ్బంది తెచ్చి పెట్టింది. ప్రభుత్వానికి చెడ్డ  పేరు వచ్చేలా వ్యవహరించారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింద. 

ముఖ హాజరు కోసం టీచర్లందరితో కొత్త యాప్ డౌన్  లోడ్ చేయించిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఇటీవల టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ హాజరును అమల్లోకి తెచ్చింది. ఎవరి ఫోన్‌లో వారు యాప్ ఫేస్ రిజిస్ట్రేషన్ చేసుకుని.. స్కూలుకు చేరుకున్న తర్వాత సెల్ఫీ తీసుకుని అందులో అప్ లోడ్ చేాయలి. అయితే ఈ యాప్ మనిషిని గుర్తు పట్టాలి.  సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటోలోలానే ఉండాలి. అయితే ఎల్ఎఎన్ ఆదినారాయణఆ తరువాత మొక్కులో భాగంగా గుండు కొట్టించుకున్నారు.  మీసాలు తొలగించారు. జుట్టు, మీసం లేని కారణంగా ఆ తర్వాతి రోజు ముఖహాజరు నమోదు కాలేదు. విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

ముఖ హాజరు యాప్‌తో  ఇబ్బందులు పడుతున్న టీచర్లు - టెక్నికల్ సమస్యలను మీడియాకు చెబుతున్న టీచర్లు

అయితే ఆదినారాయణ ఈ విషయాన్ని పత్రికలకు కూడా తెలిపాడు. దీంతో దీంతో ఆయన బాధ హైలెట్ అయింది. ప్రభుత్వం  ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.  దీనిపై ఉపాధ్యాయుడికి 17న మెమో జారీచేశారు. దీనికి  ఉపాధ్యాయుడు ఆదినారాయణ వివరణ ఇచ్చారు.  ఆ వివరాలను పత్రికలకు తాము ఇవ్వలేదని ఆ ఉపాధ్యా యుడితో పాటు ఎంఈవో వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.  

మీడియాకు చెప్పి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారని టీచర్ ఆదినారాయణనను సస్పెండ్ చేసిన డీఈవో 

ఉత్తర్వుల్లో కూడా సస్పెన్షన్ కారణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ హాజరు విషయంలో ఉన్న లోపాలను పత్రికలు తెలిసేలా చేసినందుకు  సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో డీఈవో మీనాక్షి పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నాు.  యాప్‌లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని ఏపీటీఎఫ్ పట్టణాధ్య క్షుడు అంజనమూర్తి  వ్యాఖ్యానించారు. తక్షణం ఉపాధ్యాయుడు ఆది నారాయణపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న డిమాండ్‌ను ఉపాధ్యాయ సంఘాల నేతలు చేస్తున్నారు.  అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 

14 మంది ఇప్పటం రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా - కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget