అన్వేషించండి

Shock For Ippatam Villagers : 14 మంది ఇప్పటం రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా - కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను ఆపాలని హైకోర్టును ఆశ్రయించిన 14మందికి న్యాయస్థానం లక్ష చొప్పున జరిమానా విధించింది. హైకోర్టును తప్పుదోవ పట్ిటంచారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Shock For Ippatam Villagers :  మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామ రైతులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పధ్నాలుగు మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇళ్ల కూల్చివేత జరగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు.. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కూల్చివేతనలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి గతంలో విచారణ జరిపినప్పుడు రైతులను హైకోర్టుకు రావాలని ఆదేశించారు. ఈ రోజు విచారణలో రైతులు..  ఇళ్ల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై తమకు అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి  కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించారు. 

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలని హైకోర్టులో ఇప్పటం గ్రామస్తుల పిటిషన్

ననంబర్‌ నాలుగో తేదీన ఇప్పటం గ్రామంలో ప్రధాన రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తున్నామని చెప్పి.. ఆ రోడ్డులో ఉన్న  53 ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. అంతకు ముందే వారికి రోడ్డు విస్తరణ నోటీసులు ఇచ్చారు.  ప్రభుత్వ భూమినే ఆక్రమించుకుని ఉన్న ఇళ్లను తొలగించాలని లేకపోతే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వాటిపై ముందుగానే న్యాయపోరాటం చేయలేదు ఇళ్ల యజమానులు. నవంబర్ నాలుగో తేదీన ఉదయమే కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో తమకు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అప్పటికప్పుడు హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణలో వారు హైకోర్టుకు తప్పడు సమాచారం  ఇచ్చారని వెల్లడయింది. 

ఇచ్చినట్లుగా హైకోర్టు దృష్టికి తీసుకెెళ్లిన ప్రభుత్వం

ఇప్పటం కూల్చివేతల అంశం రాజకీయంగానూ కలకలం రేపింది. జనసేన  ప్లీనరీకి అక్కడి రైతులు పొలం ఇచ్చిన కారణంగానే ప్రభు్తవం కక్ష గట్టి కూల్చివేతలకు పాల్పడిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూల్చివేసిన తర్వాతి రోజే ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత యాభై మూడు కుటుంబాలకు.., కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వచ్చే శనివారం వాటిని పవన్ కల్యాణ్ పంపిణీ చేయనున్నారు. 

కోోర్టును తప్పుదోవ పట్టించారని  రైతులకు జరిమానా

అయితే ప్రభుత్వం మాత్రం ఇళ్ల కూల్చివేతలో ఎలాంటి కక్ష సాధింపు లేదని చెబుతోంది. మార్చిలోనే రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చామని ప్రకటించింది. గ్రామ అవసరాల కోసమే రోడ్డును విస్తరిస్తున్నామని.. ప్రభుత్వం ఎవరి ఇళ్లనూ కూల్చలేదని స్పష్టం చేసింది. కేవలం ప్రహారి గోడలను మాత్రమే కూల్చామని తెలిపింది. అదే సమయంలో ఈ అంశం రాజకీయంగా దుమారం రేగడంతో..  కూల్చివేసిన ఇళ్ల ముందు.. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని.. రాజకీయం చేసి.. తమను ఇబ్బంది పెట్టవద్దన్న పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ అంశం మరింత రాజకీయం అయింది. హైకోర్టు తీర్పుపై 14 మంది రైతులు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget