అన్వేషించండి

Sarvepalli Constituency: నెల్లూరు జిల్లాలో హాట్ సీట్ సర్వేపల్లి, ఇక్కడ గెలిస్తే పండగే!

Andhra News: బెగోరె గా చిరపరిచితులైన ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం సర్వేపల్లి. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే అయ్యారు.

AP Elections 2024 Sarvepalli Constituency: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటి. జిల్లాలో ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. కృష్ణపట్నం పోర్టు సహా నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల్లూరు నగరంలో కూడా ఈ స్థాయిలో భూముల ధరలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాయకులు శాయశక్తులు ఒడ్డుతారు. ఎందాకైనా ప్రయత్నం చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి హాట్ సీట్ లాంటిది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే ఇక్కడ వైసీపీ తరపున పోటీలో నిలుస్తారు. టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు క్లారిటీ లేదు. 

నియోజకవర్గ స్వరూపం..
సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు నగరం చుట్టూ విస్తరించి ఉంటుంది. నెల్లూరు అర్బన్, రూరల్ నియోజకవర్గాలతోపాటు, కోవూరు, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలతో సరిహద్దుని పంచుకుంటుంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 229,109 కాగా.. అందులో పురుషులు 111,496 మంది, మహిళా ఓటర్లు 117,613 మంది. 

బెగోరె ప్రాతినిధ్యం.. 
బెగోరె గా చిరపరిచితులైన ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం సర్వేపల్లి. 1955లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే అయ్యారు. సీపీఐ అభ్యర్థి కె.బి.రెడ్డిపై 14,622 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్లు కూడా గెలవడం విశేషం. అంటే ఇండిపెండెంట్ తో సహా దాదాపు అన్ని పార్టీల వారిని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారన్నమాట. 

ఇది జనరల్ నియోజకవర్గం అయినా కూడా రెండుసార్లు ఎస్సీ నేతలు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1967లో సీపీఐ తరపున స్వర్ణ వేమయ్య ఎమ్మెల్యే కాగా, 1972లో కాంగ్రెస్ తరపున మంగళగిరి నానాదాస్ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సర్వేపల్లిలో కూడా ఎన్టీఆర్ హవా కనపడింది. 1983లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పెంచలరెడ్డి చెన్నారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999లో వరుసగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. అయితే ఆ తర్వాత సోమిరెడ్డి ఇక్కడ వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. వరుసగా నాలుగుసార్లు ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు. 2004, 2009లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లో కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో సోమిరెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. 

2024 సమరం ఎలా ఉంటుంది..?
వరుస పరాజయాలతో డీలాపడ్డ సోమిరెడ్డి టీడీపీ తరపున సర్వేపల్లిలో మరోసారి బరిలో నిలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఆయన్ను కాదని, కొత్తగా టీడీపీలో చేరిన రూప్ కుమార్ యాదవ్ కి టికెట్  ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అటు వైసీపీ నుంచి మాత్రం కాకాణికి టికెట్ ఖాయమని తేలినా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మొత్తమ్మీద ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశముంది. మంత్రిగా ఉన్న కాకాణి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజల్లో ఉండేలా ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు. 2024 సర్వేపల్లి హాట్ సీట్ ఎవరికి వరిస్తుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget