Sajjala On Harish Rao : హరీష్ రావు ఆ గ్యాంగ్‌తో జత కట్టారంటున్న సజ్జల - ఆ గ్యాంగ్ ఎవరు ? ఆ కథేంటి ?
ఓ గ్యాంగ్‌తో జత కట్టి ఏపీ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. టీఆర్ఎస్‌తో ఎలాంటి సమస్యలు లేవన్నారు.
![Sajjala On Harish Rao : హరీష్ రావు ఆ గ్యాంగ్‌తో జత కట్టారంటున్న సజ్జల - ఆ గ్యాంగ్ ఎవరు ? ఆ కథేంటి ? Sajjala accused Harish Rao of criticizing the AP government by teaming up with a gang. Sajjala On Harish Rao : హరీష్ రావు ఆ గ్యాంగ్‌తో జత కట్టారంటున్న సజ్జల - ఆ గ్యాంగ్ ఎవరు ? ఆ కథేంటి ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/9a87b786f9728a445c599eb11cf845c11664528699603228_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sajjala On Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న హరీష్ రావుపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.సీఎం జగన్ ను విమర్శించి రెచ్చగొట్టాలని హరీష్ రావు చూస్తున్నట్లుగా ఉందన్నారు. ఓ గ్యాంగ్ చాలా కాలం నుంచి చెబుతున్న దాన్నే హరీష్ రావు చెబుతున్నారని ఆ గ్యాంగ్ తో జతకట్టి హరీష్ రావు మాట్లాడినట్టుగా అనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ పార్టీగా తమపై విమర్శలు చేయలేదన్నారు. కానీ హరీష్ రావుకు వ్యక్తిగత సమస్యలున్నాయో తెలియదని సజ్జల చెప్పారు. తాము ఏనాడూ తెలంగాణపై విమర్శలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావుపై కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఓ గ్యాంగ్‌తో హరీష్ జత కట్టారని సజ్జల విమర్శలు
తెలంగాణలో సమస్యలు చూసుకోకుండా ఏపీ పై కామెంట్ చేయడం సరైంది కాదని సలహా ఇచ్చారు. పారదర్శకంగా సంక్షేమ పకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల స్పందన బాగుందన్నారు. కానీ ఈ సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్ధం కావడం లేదని చెప్పారు.హరీష్ రావుకు ఎందుకు ఆవేశం వచ్చిందో తెలియదన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల అంశంపై హరీష్ రావు మాట్లాడలేదన్నారు. ఏ రాష్ట్రం సమస్యలను వారే చూసుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో హరీష్ రావు చేస్తున్న విమర్శలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టారు. ఆ అంశంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీతో సబంధం లేదు.. మాకు ఏపీనే ముఖ్యం
కేసీఆర్ జాతీయ పార్టీ అంశంతో తమకు సంబంధం లేదని సజ్జల స్ప,్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తులు ఉండబోవని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఏ ఫ్రంట్ లోనూ తాము చేరబోమన్నారు. గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ ప్రసంగంపై ఊహగానాలు వచ్చాయన్నారు. తాను వెళ్లాల్సిన అవసరం లేనందున నియోజకవర్గాల్లో తన తమ్ముళ్లు తిరుగుతున్నారని సీఎం చెప్పారన్నారు.అందరూ కలిసి పనిచేయాలని సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వ పనితీరును చూపించి తరచూ విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు
హరీష్ రావుతో పాటు ఇతర తెలంగాణ మంత్రులు సందర్భం దొరకినప్పుడల్లా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. . కానీ తెలంగాణలో మాత్రం టీచర్లకు 73 శాతం పిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కేంద్రం షరతుల మేరకు వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో కొందరితో తాను మాట్లాడానన్నారు. విద్యుత్ విషయంలో తాముఇబ్బందులు పడుతున్నట్టుగా ఏపీ వాసులు చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నేతలను ఏపీకి పంపిస్తే తెలంగాణ ఏ రకంగా ముందుందో తెలుస్తుందన్నారు హరీష్ రావు . అంతకు ముందు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ వంటి మంత్రులు కూడా ఏపీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ పరంగా తమను విమర్శించడం లేదని సజ్జల చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)