RK ROja Comments : జగన్ మనసున్న మహారాజు - రోజా పొగడ్తలు !
సీఎం జగన్ మనసున్న మహారాజు అని.. ఆయన సీఎంగా ఉండటం విద్యార్థుల అదృష్టమని రోజా అన్నారు.
జగన్ ( CM Jagan ) మనసున్న మహారాజు అని అందుకే... విద్యా దీవెన పథకం కింద రూ. పదకొండు వేల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారని మంత్రి ఆర్కే రోజా ( RK Roja ) పొగిడారు. తిరుపతిలో జరగిన విద్యాదీవెన ( Vidya Deevena ) పథకం డబ్బులను మీట నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమమలో రోజా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏపీ సీఎం జగన్ ప్రవేశ పెట్టిన విద్య దీవెన పధకం అన్నారు. పేదవాడు ఉన్నత చదువులు చదివేందుకు ఏ సీఎం ఆలోచన చేయని విధంగా సీఎం జగన్ ఆలోచన చేసారని.. ఇంత గొప్ప ముఖ్యమంత్రి ( CM ) దొరకడం విద్యార్థుల అదృష్టమన్నారు.
మహిళలు, యువతులపై రేప్‌లు చేసింది వాళ్లే, ఆ మీడియా దాచిపెడుతోంది: సీఎం జగన్ వ్యాఖ్యలు
తాము చదువుకొనే సమయంలో ఇలాంటి ముఖ్యమంత్రి లేడు.. కానీ ఆయన కాబినెట్ లో మంత్రిగా ( Minister ) చేయడం చాల సంతోషమని రోజా పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలు పారదర్శకంగా తల్లితండ్రుల అకౌంట్లో నగదు వేయడం జరుగుతోందన్నారు. పేదలంటే చంద్రబాబుకు ( Chandrababu ) నచ్చదు, అందుకే పరిమితి పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న రూ. వెయ్యి కోట్లకుపైగా బకాయిలను సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ మాఫీ చేశారన్నారు. రూ. 11 వేల కోట్ల రూపాయల నగదు వేసిన మనసున్న మహారాజు సీఎం జగన్ అని అభినందించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు - పీపీఏ బకాయిలు చెల్లించలేమని హైకోర్టుకు సమాచారం !
సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆదరణ పొందుతుంటే చంద్రబాబు ఓర్వలేకున్నారని విమర్శించారు. సీఎం జగన్ ( CM jagan ) అరిష్టం అంటూ చేసిన చంద్రబాబు సీఎంగా ఉంటే కరువు తాండవిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ( Elections ) బాదుడే బాదుడు అంటూ ఉన్న 21సీట్లను చంద్రబాబు కోల్పోతారని జోస్యం చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతీరోజూ సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఉన్నత విద్యంటే ఉన్నోడి కాదు.. అర్హత ఉన్నోడికి అందాలన్నదే విద్యా దీవెన ఉద్దేశమని ఆమె అన్నారు.
జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!