అన్వేషించండి

Roja comments : టిక్కెట్ ఇవ్వకపోయినా జగనన్నకు ప్రాణం ఇస్తా - నగరిలో నేనే ఫస్ట్ - రోజా కీలక వ్యాఖ్యలు

Roja : నగరిలో టిక్కెట్ ఇవ్వకపోయినా జగన్‌కు ప్రాణం ఇస్తానని రోజా వ్యాఖ్యానించారు. టిక్కెట్ ఇవ్వరంటూ తనపై ప్రచారం చేస్తున్నది టీడీపీనేనని ఆరోపించారు.

Nagari MLA Roja :  నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా తాను జగనన్నకు ప్రాణం ఇస్తానని మంత్రి రోజా అన్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  తనకు ఎమ్మెల్యే సీటు (  Nagari MLA ) లేదు అనే ప్రచారం కేవలం‌ శునకానందం మాత్రమే అని  స్పష్టం చేశారు.  ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. 

అన్ని కార్యక్రమాల్లోనూ ముందున్నా!

క్యాబినెట్ సమావేశంమైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎప్పుడూ నేను ముందు ఉంటానని తెలిపారు. టీడీపీ ( TDP ) అనుకూల మీడియా  దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టిక్కెట్ రాదని చెప్పి టీడీపీకి వైసీపీ అభ్యర్థులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.  జగనన్నపై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, అంతకు మూడింతలు పార్టీలో మా అందరికీ ప్రేమ ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు.. సర్వేల ద్వారా చర్చ జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారని, ప్రజల వద్ద జగనన్నకు వ్యతిరేకత లేదని రోజా స్ప,్టం చేశారు.  

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో హై టెన్షన్‌- సీటు ఎవరికి? వేటు ఎవరిపై?

ప్రజలకు అందుబాటులో లేని వారికే టిక్కెట్లు మార్పు 

ప్రజలకు అందుబాటులో లేక సీట్లు లేక పోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని రోజా అన్నారు.  నగిరిలో సీటు రోజాకు లేకుంటే ఎవరు నిల్చుకుంటారని ప్రశ్నించారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక్కచోట నిలబడటానికి భయపడుతున్నారని, అందుబాటులో‌ ఉన్నాం కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యామని, 175 సీట్లకి 175 పక్కాగా వైసిపి గెలుపు సాధిస్తుందని అన్నారు.  నగరిలో ఎవరికి ఇచ్చినా తాను జగన్ అన్నకు ప్రాణం ఇస్తానని స్పష్టం చేశారు. 

శ్రీకాకుళంలో కొత్త ప్రయోగం చేయనున్న వైఎస్‌ఆర్‌సీపీ- ప్రస్తుతానికి ఎచ్చెర్ల లీడర్లకు విజయవాడ పిలుపు

రోజాకు టిక్కెట్ నిరాకరిస్తున్నారని  విస్తృత ప్రచారం 

నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజాకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగా సీఎం జగన్ టిక్కెట్ నిరాకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలతో రోజాకు సఖ్యత లేదు. ఐదు మండలాల నాయకులు రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజాకు వ్యతిరేకమేనని చెబుతున్నారు. ఈ క్రమంలో రోజా తనకు జగన్ టిక్కెట్ ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.                                             

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
Viral Video: ఇదేందయ్యా ఇది.. మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
ఇదేందయ్యా ఇది.. ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Embed widget