YS Viveka Case : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి సాక్షి రంగన్న - వివేకా హత్య కేసులో ఈయన ఎంత కీలకం అంటే ?
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన వాచ్‌మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత కలిగింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రంగన్నకు చికిత్స పొందుతున్న రంగన్నను మెరుగైన వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు అనారోగ్యం తీవ్రమవడంతో తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులగా స్విమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వివేకా హత్య కేసులో వాచ్ మెన్ రంగన్న కీలక సాక్ష కావడంతో ప్రత్యేక పోలీసు భధ్రత కూడా ఏర్పాటు చేశారు. రంగన్న ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో గురువారం మధ్యాహ్నం స్విమ్స్ ఆసుపత్రి నుండి సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక పోలీసు భధ్రత నడుమ రంగన్నను తరలించారు.
వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని గతంలోనే సీబీఐ రికార్డు చేసింది. పులివెందులలోని భాకరాపురానికి చెందిన రంగన్న చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. విచారణలో భాగంగా ఇదివరకు ఇతనికి సిట్ బృందం నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేయించింది. సీబీఐ.. రంగయ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో తొమ్మిది మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు రంగయ్య చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. పులివెందులలో ఇంటికి చేరుకున్నాక రంగయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు భయం వేస్తోందని రంగన్న సమాధానమిచ్చారు. భయపడాల్సిన పనిలేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్నవారి చెవిలో.. వైఎస్ వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, పాత డ్రైవర్ దస్తగిరి, సునీల్‌కుమార్ పేర్లను చెప్పారు. ఈ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
సిఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో ఒకడైన కల్లూరి గంగాధర్ రెడ్డి కూడా గతంలో అనారోగ్యంతో చనిపోయారు. ఏ వైఎస్ వివేకా హత్య కేసు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. వివేకా హత్య సమయంలో లెటర్‌పై సీబీఐ విచారణ నిర్వహించింది. నేడు సీబీఐ విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ హాజరయ్యారు. ఇద్దరినీ కలిపి సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. ఆధారాలు చెరపడంలో కీలక పాత్ర పోషించారు.