అన్వేషించండి

Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు

Rajya Sabha MP Sudhamurthy | రాజ్యసభ ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో రెండు అంశాలపై ప్రశ్నలు అడిగారు. వాటికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా బదులిచ్చి ఆకట్టుకున్నారు.

న్యూఢిల్లీ:  దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, విజయపురకు విమానాలు ఎప్పుడు వస్తాయని రాజ్యసభలో ప్రశ్నించారు. రాజ్యసభలో సుధామూర్తి మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ విజయపుర. పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్ట్ సిద్ధం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ సందర్భంగా ఓ విషయం అడుగుతున్నాను. విజయపురకు విమానాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. నేను ఎప్పుడు అడిగినా త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు. ఈసారి అలా కాదు. కచ్చితంగా దీనిపై మాకు సమాధానం కావాలి. 

54 సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఉన్నాయి. 140 కోట్ల భారతీయులకు ఇది చాలా తక్కువ అని నా అభిప్రాయం. దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో సివిల్ ఏవియేషన్ కాలేజీలు, కేంద్రాలు లేవు. దీనిపై కేంద్రం ఫోకస్ చేయాలి. ఇది మా రిక్వెస్ట్’ అని సుధామూర్తి రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. సుధామూర్తి అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇది తిరుపతికి సంబంధించిన విషయం. అయితే సుధామూర్తిగారు విజయపుర పేరును ఇక్కడ ప్రస్తావించారు. విజయపురకు త్వరలోనే విమానాలు వస్తాయి. ఇదే ఏడాది అది అమలు చేస్తాం. కావాలంటే లిఖిత పూర్వకంగా మీకు సమాధానం ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సాధ్యం చేస్తాం. సివిల్ ఏవియేషన్ కాలేజీలు 54 మాత్రమే ఉన్నాయి. అందులో పైలట్లతో పాటు మెయింటనెన్స్ ఇంజినర్లకు ట్రైనింగ్ ఇస్తారు. మరో 3 కాలేజీకు అప్రూవల్ వచ్చింది. మరో 9 ఏవియేషన్ కాలేజీల కోసం కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రతి ఏడాది 1500కు పైగా పైలట్లు శిక్షణ తీసుకుంటున్నారు. దేశంలో మరికొన్ని కాలేజీలు అవసరం ఉంది కనుక ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఇందుకోసం ముందుకొస్తే కేంద్రం వారికి సహకారం అందిస్తుంది. 

వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 10 ఏళ్లలో 100, 20 ఏళ్లలో 200 విమానాశ్రయాలు నిర్మించి విమాన సర్వీసులు అందించాలని కేంద్రం భావిస్తోంది. కానీ విమానాశ్రయాలతో పాటు అక్కడ పార్కింగ్, ఆ స్థాయిలో స్థలం సేకరణ లాంటి చాలా అంశాలు ఆలోచించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సుధామూర్తి గారితో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు ఇస్తాం. సెషన్స్ లో మరోసారి ఈ విషయం ప్రస్తావన అవసరం లేదని’ రామ్మోహన్ నాయుడు ఎంపీ సుధామూర్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చి రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget