అన్వేషించండి

KA Paul Comments: ‘నేను అలా ప్రధాని అవుతా, పవన్ కల్యాణ్‌ని సీఎం చేసేద్దాం’ కేఏ పాల్ కామెడీ కామెంట్స్, RGV సెటైర్లు

KA Paul Comments: కేఏ పాల్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో ఉంచారు. ఈ సందర్భంగా పాల్ మరోసారి ఊహకందని, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో హాట్ హాట్‌గా సాగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యలు, చేష్టలతో అందర్నీ కడుపుబ్బా నవ్వించారు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల నుంచి దూరమై అమెరికాలోనే ఉంటున్నా.. అడపాదడపా ఇక్కడి పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా మళ్లీ ఆయన చేసిన కామెడీ వ్యాఖ్యలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలను కోట్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.

తాజాగా కేఏ పాల్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన లైవ్ చేశారు. ఈ సందర్భంగా పాల్ మరోసారి ఊహకందని, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వీడియోలో పాల్ మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ ముఖ్యమంతి కావాలన్నా, మంత్రి అవ్వాలన్నా.. ఒక ఉపాయం ఉంది. పవన్ అభిమానులందరికీ నేను చెబుతున్నా.. మీకు కనీసం ఒక్క శాతం నీతి, నిజాయతీ ఉన్నా పవన్ కల్యాణ్‌ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు ‘ఎస్’ అంటే నేనే ప్రధాన మంత్రి అవుతాను. కావాలంటే పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేసేద్దాం. దాంట్లో తప్పేముంది?” అంటూ చెప్పుకొచ్చారు. చాలా సేపు పాల్ మాట్లాడినా.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన షార్ట్ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘హే.. పవన్ కల్యాన్ సర్! నేను కాబోయే ప్రధాన మంత్రి కేఏ పాల్‌‌ను చెబుతున్నారు విను” అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను కూడా జత చేశారు. పవన్ కల్యాణ్ సహా కేఏ పాల్‌‌ వ్యవహార శైలిపై రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఇటీవల కూడా పవన్‌ కల్యాణ్‌ - రానా సినిమా ‘భీమ్లా నాయక్’ తనకి నచ్చిందని ట్వీట్ చేశారు. సినిమా అంతా ఉరుములు, మెరుపులు అంటూ పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచారు. తాజాగా కేఏ పాల్‌ వ్యాఖ్యలపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
AP MPTC ZPTC Election Results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget