అన్వేషించండి

Andhra Pradesh Results 2024: అయ్యయ్యో పార్టీ గెలవకపోయెనే... అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

Andhra Pradesh News: వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో చాలా మంది బెట్టింగ్‌లలో పెట్టుబడి పెట్టి నష్టపోయి తలలు పట్టుకుంటున్నారట. కొందరు పంచమని ఇచ్చిన సొమ్మునే బెట్టింగ్‌లలో పెట్టారని టాక్ నడుస్తోంది.

YSRCP News: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ.. దానినే నమ్ముకున్న ముఖ్య నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మరోలా కూడా నష్టపోయారని ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ గెలుస్తుందని, తమ అభ్యర్థులు నెగ్గుతారని విపరీతంగా బెట్టింగ్‌ల్లో పాల్గనడమేనట. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అని తమ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు నెగ్గుతారని వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు వేశారు. ఈ పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉందన్న ప్రచారం ఎక్కువగా ఉంది...

పంచమని ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి..?
ఎన్నికల్లో డబ్బులు పాత్ర చాలా కీలకం కాగా వైసీపీ నాయకత్వం పంపించిన డబ్బులు గ్రామాల్లో చివరి వరకు చేరలేదని, ఈ డబ్బును చాలా మంది నొక్కేసారని ప్రచారం సాగుతోంది. మీరు సరిగ్గా పంచలేదంటే మీరు సరిగ్గా పంచలేదు. అయినకాడికి నొక్కేసారని ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారట. పథకాలు లబ్ధిపొందిన జనాలు ఎలాగూ ఓట్లేస్తారు.. ఇంక మనం పంచేదేంది..? అవసరమా అని చాలా మంది నాయకులు తమ జేబుల్లో పెట్టుకున్నారట. ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్లు ప్రజలకు పంచమని పంపిన డబ్బును పంచకుండా నొక్కేసారని సొంత పార్టీలోనే నాయకుల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట.

బెట్టింగ్‌ల్లో యమ స్పీడుగా...
మా పార్టీ గెలుస్తుంది.. మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ వైసీపీ నాయకులు ఈసారి చాలా పెద్దస్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంతకీ ఇంత డబ్బు ధైర్యంగా ఎలా వేస్తున్నారని ఆరాతీసిన కొందరికి అసలు విషయం తెలిసి కొట్టేసిన సొమ్మేకదా... వస్తే డబుల్‌ వస్తుంది. లేకపోతే పోతుంది అన్న ధీమాతో మరీ బెట్టింగ్‌లు పెట్టి పోగొట్టుకున్నారట. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.. 

అన్నిచోట్ల కూటమికి బంపర్‌ మెజార్టీ..
పలానా మండలంలో మాకు మెజార్టీ వస్తుంది.. ఆ గ్రామం మాదే.. అక్కడ మెజార్టీ రెట్టింపు వస్తుంది.. ఇలా ఎవరికి వారు వైసీపీ అభ్యర్ధులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.. తీరా ఫలితాల్లో తారుమారు అవ్వడంతో అవాక్కయిన పరిస్థితి కనిపించిందట.. ముఖ్యంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో, వార్డుల్లోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.. బూత్‌ల వారీగా మెజార్టీలను తెప్పించుకొని చూసి ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థులు ఇదేం దారుణంరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారట.. మనకు పట్టున్న ప్రాంతంలో, పైగా మన నాయకులు ఎక్కువగా ఉన్న చోట కూటమికే ఇంత ఎక్కువగా మెజార్టీ రావడం ఏంటని, దీనికి ఒక కారణం మన నాయకులే అని పోస్ట్‌మార్టం చేసుకుంటున్నారట..

కొంప ముంచిన ఎగ్జిట్‌ పోల్స్‌..
ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం గెలువబోతుంది.. మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌ అవుతారని కొన్ని ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఊదరగొట్టడంతో దానిని నమ్మిన వైసీపీ నాయకులు భారీ ఎత్తులో బెట్టింగ్స్‌లో పాల్గని చాలా నష్టపోయారట.. ముందు కొంచెం తక్కువ స్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడినా ఆఖరి వారం రోజుల్లో వైసీపీ గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాయడంతో పార్టీ అధికారంలోకి రాక బెట్టింగ్‌ల రూపంలో లక్షల రూపాయలు పోగొట్టుకుని దిగాలు పడ్డారట..  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget