Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Dwarampudi Chandra Sekhar Reddy: కాకినాడలో తనను టార్గెట్‌గా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.
Andhra Pradesh: కాడినాడలో అక్రమకట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారని అధికారులు చర్యలు ప్రారంభింారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వివరించారు.
అక్రమకట్టడాల్లో మాజీ ఎమ్మెల్యేద్వారంపూడి ముఖ్య అనుచరుడైన బల్ల సూరిబాబు ఇల్లు ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేస్తున్నారన్న విషయం తెలుసకున్న ద్వారంపూడి నేరుగా స్పాట్‌కు వచ్చి అధికారుల చర్యలను నిలదీశారు.
కూల్చివేతలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపారు. అధికారులు ఆయనతో మాట్లాడి అసలు బిల్డింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని వివరించే ప్రయత్నం చేశారు. అవేమీ ద్వారంపూడి పట్టించుకోలేదు.
ప్రభుత్వం కావాలనే కక్షసాధింపులకు దిగుతోందని ఆరోపించారు ద్వారంపూడి. టార్గెటెడ్‌గానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై న్యాయపోరాాటం చేస్తామని అన్నారు.