Maoists In Maredumilli Forest: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకుంటున్నాయా? మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ డీకోడ్ చేస్తున్న పోలీసులు!
Maoists In Maredumilli Forest: రంపచోడవరం డివిజన్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందడం వెనుక కారణం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.

Maoists In Maredumilli Forest: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా చేపట్టిన ఆపనేషన్లులో మావోయిస్తులకు ద్బెమీద దెబ్బతగులుతూనే ఉంది. వరుస ఆపరేషన్లులో మావోయిస్టు పార్టీ కీలక సెంట్రల్ నేతలు ఒక్కొరు హతమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం నుంచి రంపచోడవరం డివిజన్‌వైపు మావోనేతలు ఇటువైపుగా వరుస కట్టడం వారి ఉనికికే ప్రమాదాన్ని తీసుకొస్తుందా అంటే అవుననే అంటున్నారు. పోలీసులు చేపడుతున్న కూంబింగ్‌లో వరుసగా మావోల కీలక నేతలు హతమవుతున్న నేపథ్యంలో జూన్ 18 మావోలకు మరింత పెద్దదెబ్బ తగిలినట్లయ్యింది.. రంపచోడవరానికి 26 కిలోమీటర్లు దూరంలో ఉన్న దేవిపట్నం మండలం కించకూరు కాకవాడ గండి దట్టమైన అటవీప్రాంతంతంలో పోలీసులకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృత్యువాత పడడం సంచలనంగా మారింది.
చాలా రోజులుగా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో మావోల కదలిక కూడా అంతంత మాత్రంగా మారిందని అయితే తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయనే తెలుస్తోంది. పోలీసులు, మావోల మధ్య జరిగి ఎదురు కాల్పల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ(మావోయిస్టు నేత చలపతి సతీమణి), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంజు మృతి చెందారు. దీంతో రంపచోడవరంలో మావో కదలికలున్నాయన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది..
ఛత్తీస్‌గఢ్ మీదుగా రంపచోడవరం డివిజన్‌లోకి..
ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తుండగా వరుస సంఘటనలతో కీలక సెంట్రల్‌కమిటీ నేతలు దుర్మరణం చెంది పార్టీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లింది.. ఈక్రమంలోనే ఏవీబీ నుంచి ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చే రంపచోడవరం డివిజన్‌లోకి మావోయిస్తు పార్టీ కీలక నేతలు వరుస కడుతున్నారని పోలీసలు గుర్తించారు. ఈక్రమంలోనే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు కీలక నాయకుడిగా ఉన్న చలపతిరావు అలియాస్ చలపతి కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
ఈ ఎన్‌కౌంటర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్ చింతూరు ఏజెన్సీ ప్రాంతం ముక్కాళి అటవీప్రాంతంలో జరిగింది. ఆ తరువాత ఇదే జిల్లాలోని వై.రామవరం ఏజెన్సీ ప్రాంతంలోని యార్లగడ్డ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.. కగార్ ఆపరేషన్‌లో భాగంగా గ్రేహౌండ్స్ బలగాలు రంపచోడవరం డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండడానికి కారణం ప్రధానంగా ఈ ప్రాంతంలోకి గత కొంతకాలంగా మావోయిస్తులు వస్తుండడం కారణంగా నిలుస్తోందంటున్నారు.
సాంకేతికతతోనే మావోల కదలికలపై నిఘా..
అందుబాటులోకి వచ్చిన సాంకేతి పరిజ్ఞానంతో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా పెట్టిన పోలీసులు దట్టమైన అడవుల్లో మావోల ప్రతీ కదలికను ఇట్టే పసిగడుతున్నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవుల్లో సైతం ధర్మల్ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను పసిగట్టగలుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లోకి అటవీమార్గం ద్వారా ఇటీవల కాలంలో వచ్చిన పలువురు మావోయిస్టు పార్టీ కీలకనేతలు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు ఇద్దరు మృతి చెందడం కూడా మావోలు మరో మార్గంలేని స్థితిలోనే రంపచోడవరం డివిజన్‌లో తలదాచుకుని మృత్యువాతపడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి.





















