అన్వేషించండి

Nara Lokesh Yuvagalam Resumed: రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే యువగళం పున:ప్రారంభం

TDP leader Nara Lokesh News: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి (BR Ambedkar Konaseema) నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం అవుతోంది.

Nara Lokesh, Yuvagalam Padayatra: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. టిడిపి నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున లోకేష్ కి స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి పొదలాడ యువగళం క్యాంప్ సైట్ కి వెళ్లారు నారా లోకేష్ (Nara Lokesh). డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి (BR Ambedkar Konaseema) నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం అవుతోంది. రాజోలు మండలం పొడలాడ గ్రామంలో 78 రోజులు కిందట చంద్రబాబు అరెస్ట్ కారణంగా  నిలిచిన యువగళం పాదయాత్ర అక్కడి నుంచే ప్రారంభం చేయనున్నారు. 210వరోజు నవంబర్ 27న ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యువగళంలో భాగంగా లోకేష్ ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2852.4 కి.మీ.

పాదయాత్ర కోసం ఇప్పటికే టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పొదలాడ నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పి.గన్నవరంలో గెయిల్‌, ఓఎన్‌జీసీ బాధితులతో ముఖాముఖి.. మామిడికుదురులో స్థానికులతో లోకేష్ భేటీ అవుతారు. సోమవారం దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేశ్‌ పాదయాత్ర సాగనుంది. లోకేష్ పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో మొదలైంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4000 కి.మీ.ల పాదయాత్ర లోకేష్ అనుకున్న లక్ష్యం. సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 


Nara Lokesh Yuvagalam Resumed: రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే యువగళం పున:ప్రారంభం

రాష్ట్రంలో 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల విరామానంతరం ప్రారంభం చేయనున్నారు. చంద్రబాబునాయుడుపై  కేసులు బనాయించి జైలుకు పంపడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశరాజధాని డిల్లీలో న్యాయపోరాటం చేస్తూనే లోకేష్ జాతీయస్థాయి నేతల మద్దతు కూడగడుతూ జాతీయ మీడియాలో తమ గళాన్ని విన్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాష్ట్రంలో తీరును ఆమె దృష్టికి తెచ్చారు. తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన లోకేష్... అన్ని అడ్డంకులను అధిగమించి ఈనెల 27వతేదీ నుంచి గతంలో పాదయాత్ర నిలుపుదల చేసిన పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగనున్న యువగళం తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
రాజోలు/పి.గన్నవరం/అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)
ఉదయం
10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జిసి బాధితులతో లోకేష్ ముఖాముఖి.
2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.

సాయంత్రం
4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget