అన్వేషించండి

Chandra Babu Naidu:సీనియర్ అధికారులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు- వైరల్‌ అవుతున్న వార్త!

Andhra Pradesh News: జగన్‌కు అడ్డగోలుగా మద్దతు ఇస్తూ చట్టం పరిధిలో పని చేయలేదని తనను అరెస్టు చేయడమే కాకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని ఇద్దరు అధికారులకు చంద్రబాబు అపాయింట్మెంట్‌ ఇవ్వలేదు.

Telugu Desam Party President Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే అధికార మార్పిడీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. చాలా మంది అధికారులు చంద్రబాబుతో సమావేశమై శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన రోజునే సీఎస్‌ జవహర్ రెడ్డి టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు. మర్యాదకపూర్వకంగా సమావేశమై ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇదే క్రమంలో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లకు చంద్రబాబు షాక్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి తనను కలిసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్లిద్దరు టార్గెటెడ్‌గా టీడీపీ లీడర్లను ఇబ్బంది పెట్టారని ఎప్పటి నుంచో తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 

ఆంజనేయులు తిరుగు ముఖం

ఈ ఉదయం చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఆయన కారును పోలీసులు ఆపేశారు. చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చానని చెప్పుకున్నప్పటికీ వినలేదు. కలిసేందుకు అనుమతి లేదని కారును వెనక్కి పంపేశారు. దీంతో ఆంజనేయులు అక్కడి నుంచి వచ్చేశారు. 

కలిసేందుకు ససేమిరా

మరో అధికారి కొల్లి రఘురామిరెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. చంద్రబాబును కలవాలని అపాయింట్‌మెంట్ కోసం అధికారులకు ఫోన్ చేశారు. కలిసేందుకు పర్మిషన్ లేదని అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారని సమాచారం. ఒకే రోజు ఇద్దరు అధికారులకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సంజయ్‌ది అదే పరిస్థితి

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ కూడా చంద్రబాబును కలిసేందుకు యత్నించారు. ఆయనకి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. చంద్రబాబు నివాసంలోకి ప్రవేశిస్తున్న కారును అధికారులు అడ్డుకొని వెనక్కి పంపించారు. ఎన్నికల తర్వాత ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం మారడతంతో ఆ అనుమతి రద్దు అయినట్టు చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబును మర్యాద పూర్‌వకంగా కలిసేందుకు వెళ్లిన ఆయను నిరాశే ఎదురైంది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఈయన కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆంజనేయులు, రఘురామిరెడ్డి మాదిరిగానే కలిసేందుకు చంద్రబాబు విముఖత చూపించారు. 

సంజయ్‌, ఆంజనేయులు, రఘురామిరెడ్డి ఇద్దరు కూడా జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండే ఆంజనేయులు ప్రతిపక్షాలను అణచివేయడానికి ఎత్తులు వేశారని టీడీపీసహా ఇతర పార్టీలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా దీన్ని కొనసాగించారని చెప్పుకుంటున్నారు. చివరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నప్పటికీ ఆయన చేష్టలు ఆగలేదని అంటున్నారు. ఆయన్ని ఐబీ చీఫ్‌గా తప్పించినప్పటికీ వైసీపీకి సహాయం చేశారని ఆరోపించారు టీడీపీ నేతలు. 

కొల్లి రఘురామిరెడ్డి చర్యలు మరింత దారుణంగా ఉన్నాయని చంద్రబాబే స్వయంగా అప్పట్లో చెప్పారు. ఐటీ చీఫ్‌గా ఉండే కొల్లి రఘురామిరెడ్డి టీడీపీ నేతలే టార్గెట్‌గా పని చేశారని అంటారు. చంద్రబాబును కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని రాత్రికి రాత్రే నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో అమరావతి తీసుకొచ్చారని గుర్తు చేస్తారు టీడీపీ నేతలు. అనేక సందర్భంగా ఆయన పక్షపాత ధోరణి వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. 

జగన అండ చూసుకొని అప్పట్లో రెచ్చిపోయిన ఈ ఇద్దరు అధికారులు ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే చంద్రబాబు నిరాకరించి ఉంటారని పేర్కొంటున్నారు. ఇలాంటి వైఖరి గతంలో చంద్రబాబులో ఉండేది కాదని కానీ కార్యకర్తలు పడిన ఇబ్బందులు చూసే ఇది అలవర్చుకుని ఉంటారని అంటున్నారు. 

Also Read: జగన్ కంచుకోట ఎందుకు కూలింది? ప్రజల్లో మరీ అంత వ్యతిరేకత ఉందా! వైసీపీ ఓటమికి టాప్ 10 రీజన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget