Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేషన్ దుకాణం విషయంలో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళిన అధికారులకు సదరు మహిళ నుంచి ఈ ప్రతి ఘటన ఎదురైంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ మహిళ బీభత్సం రేపింది. ప్రభుత్వ అధికారుల ముందే పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించింది. అంతేకాక, వారి కళ్లలో కారం కొట్టి మరీ విపరీతంగా ప్రవర్తించింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేషన్ దుకాణం విషయంలో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళిన అధికారులకు సదరు మహిళ నుంచి ఈ ప్రతి ఘటన ఎదురైంది.
రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డి సమక్షంలో ఓ మహిళ మరో మహిళ కానిస్టేబుల్‌పై రాడ్డుతో దాడి చేసింది. అంతేకాక, ఆమె కళ్ళల్లో కారం కొట్టి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
రాయవరం మండలం నదురుబాడకు చెందిన మిర్తిపాటి జ్యోతి అనే మహిళకి ఓ రేషన్ డిపో ఉంది. ఈ రేషన్ డిపో గత కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం సదరు డిపోను లలితమహిళ స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికి ఆమె నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఇక ఫలితం లేక ఉన్నతాధికారులైన ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డిలు రంగంలోకి దిగారు.
Also Read: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్
ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. రేషన్ సరుకులు, మిషన్ తదితర వాటిని స్వాధీనం పర్చుకోవాలని ఆర్డీవో సింధు ఆదేశాలు జారీ చేశారు. ఈలోపే ఆమె తలుపులు మూసుకుని ఎవ్వరినీ లోపలికి రానీయలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో అదేశించగా మహిళా కానిస్టేబుళ్లు ముందుకు కదిలారు. ఎదురుగా వెళ్లిన మహిళా పోలీసు, ఇతర సిబ్బందిపై మహిళ తలుపు సందుల్లో నుంచి రాడ్డుతో దాడి చేసింది. అంతేకాక, వారి కళ్ళల్లో కారం కొట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీసులను డీఎస్పీ ఆదేశించారు.
Also Read: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్