అన్వేషించండి

Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మ‌రో కేసు న‌మోదు, అసలేం జరిగింది?

RGV News | వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో పోలీసు కేసుల‌ను ఎదుర్కొంటున్న సినీద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌పై కాపునాడు నాయ‌కులు ఫిర్యాదు చేశారు. కాపుల‌ను రిప్ అంటూ కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Police case Against RGV | వివాద‌స్ప‌ద ట్వీట్ల ద్వారా కేసులు ఎదుర్కొంటున్న సంచ‌ల‌న‌  ద‌ర్శ‌కుడు  రామ్ గోపాల్ వర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. 2023 జ‌న‌వ‌రి ఎనిమిదో తేదీన ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమంలో "కాపు" కులంపై చేసిన వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైంది. కాపునాడు అంబేడ్క‌ర్ కోనసీమ జిల్లాలోని అమ‌లాపురానికి చెందిన కాపునాడు నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మపై బి.యన్.యస్ 196 సెక్షన్, ఇతర సంభందిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలని కోరుతూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ పిలుపు మేరకు సంయుక్త కార్యదర్శి అబ్బిరెడ్డి శ్రీరామ్మూర్తి, కాపునాడు సంఘ నాయ‌కులు ప‌లువురు అమ‌లాపురం పోలీసుల‌కు పిర్యాదు చేశారు. 

తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదు..

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా  08-01-2023 న తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి  నారాచంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల్లో సీట్ల సర్దుబాటు గురించి చర్చించుకున్నారు. ఆ సందర్భంగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ "RIP కాపులు - కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు" అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారనీ, ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో గల కాపు సామాజిక వర్గ ప్రజల మనోభావాలను కించపరిచాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  RIP అన్న పదం కాపు కులాన్ని కించపరుస్తూ, కాపు కులం చ‌చ్చిపోయింద‌ని, ఆ  కులానికి శ్రద్ధాంజలి అనే విధంగా రామ్‌గోపాల్ వ‌ర్మ కామెంట్ ఉందనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు

సమాజంలో అశాంతిని సృష్టిస్తూ తన అనాగరిక ధోరణితో కులాల మధ్య అంతరాలను పెంచుతున్న రామ గోపాల్ వర్మ పై తగిన చర్యలు తీసుకోవాలని కాపునాడు పక్షాన కోరారు."కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు .. RIP కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు 😔😔😔 అంటూ రామ్ గోపాల్ వర్మ అప్పట్లో అంతర్జాతీయంగా కోట్లాదిమంది వీక్షించే సామాజిక మాంద్యమం అయిన ట్విట్టర్ (ఇప్పుడు X) వేదికగా Ram Gopal Varma @RGVzooin ఖాతాలో 08-01-23, రాత్రి 11:05 నిమిషాలకు పోస్ట్ చేసి వ్యాఖ్యానించడంపై  పవన్ కళ్యాణ్ ని, కాపు కులాన్ని కించపరిచి డబ్బుకు అమ్ముడుపోయారని దిగజార్చి చెప్పడమేనని భావిస్తున్నామన్నామ‌ని ఫిర్యాదులో స్ప‌ష్టం చేశారు.

ఆర్జీవీ వ్యాఖ్యలపై అభ్యంతరం

"భిన్నత్వంలో ఏకత్వం" గల భారత రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ రాష్ట్రంలోని కులాలన్నీ సోదర భావంతో కలిసి మెలిసి నడుస్తూ,రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న ప్రస్తుత తరుణంలో రామ్ గోపాల్ వర్మ వంటి విభజన వాదులు చేసే వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని సృష్టిస్తూ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాపు కులస్తులందరి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన రామగోపాల్ వర్మపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టి తగిన శిక్షలు విధించాలని ఆ ఫిర్యాదులో కోరారు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై ఫిర్యాదు చేసిన వారిలో కాపునాడు నాయకులు గంగుమళ్ళ శ్రీనివాస్, పత్తి దత్తుడు, తోట శ్రీను, అడబాల తాతకాపు, విళ్ళ సుబ్బారావు, గుండాబత్తుల తాతాజీ, జాంబ తిరుపనాదం, చాగంటి ప్రసాద్,దైవాల రాంబాబు, పోలిశెట్టి వీరబాబు, గుర్రాల రమేష్, గారపాటి బాలాజీ,వింటి దిలీప్,దార్లంక సురేష్ కాపు యువత పాల్గొన్నారు.

Also Read: AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Hindu Gods: హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై  ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
Embed widget