By: ABP Desam | Updated at : 20 Apr 2023 02:17 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
క్లాస్ రూంలో పిల్లలు ఒకరిని మరొకరు కత్తులతో దాడి చేసుకోవడం కలకలం రేపింది. వారు తొమ్మిదో తరగతి చదువుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో దారుణమైన ఘటన జరిగింది. రాజానగరం ప్రభుత్వ హైస్కూల్లో ఓ విద్యార్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. పరీక్ష జరుగుతుండగానే ఎక్సామ్ హాల్‌లో టీచర్ల ఎదుటే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజానగరం ప్రభుత్వ హైస్కూల్‌లో పెంకే శ్రీహరి సాయి, ఉదయ్ శంకర్ అనే ఇద్దరు బాలురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పరీక్షా హాలులో పరీక్ష రాస్తుండగా శ్రీహరి సాయిపై ఉదయ్ శంకర్ అనే విద్యార్థి కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి బాధిత విద్యార్థిని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ అఘాయిత్యానికి ప్రేమ వ్యహహారమే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?