News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

హామీలు గుర్తు చేస్తూ శిలాఫకాలు - పాదయాత్రలో లోకేష్ నయా ట్రెండ్‌

హామీలు ఇవ్వడమే కాదు వాటిని మ్యానిఫెస్టులో పెట్టడమే కాదు. వాటిని నిత్యం గుర్తు చేసేలా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు. పాదయాత్రలో నయాట్రెండ్‌ లోకేష్ సృష్టిస్తున్నారు.

FOLLOW US: 
Share:

200 రోజుల పాదయాత్రలో ఆనేక వర్గాల ప్రజలతో లోకేష్ మమేకమయ్యారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్‌ చేస్తూ సాగిన యాత్ర 2710 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వివిధ సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనా ఆగక సాగుతోంది లోకేష్‌ పాదయాత్ర. ఎన్నిరోజులు చేస్తారులే అని చాలా మంది అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకొని ఒక్కో మైలురాయిని అదిగిమిస్తున్నారు. ప్రజల సమస్యలను ఓపికతో వింటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఎలా పరిష్కరిస్తారో వివరిస్తున్నారు. ఇలా 200 రోజుల్లో 3813 వినతి పత్రాలు స్వీకరించారు. ఇంకా లక్షల మందిప్రజలను నేరుగా కలుసుకొని వారి సాదకబాదకాలు తెలుసుకున్నారు. 

64 బహిరంగ సభల్లో ప్రసగించారు లోకేష్. వివిధ వర్గాల ప్రజలతో 132 ముఖాముఖీ సమావేశాల్లో మాట్లారు. 8 రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా స్థానిక ప్రజల సమస్యలు, రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన ఇబ్బందులు తెలుసుకొని వారికి కొన్ని హామీలు ఇచ్చారు. ఇలా పాదయాత్ర సాగుతున్న టైంలో లోకేష్‌ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారో ఓ సారి చూద్దాం. 
ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 

జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడికి ఎనిమిది రోజుల తర్వాత పూతలపట్టు నియోజకవర్గంలో బంగారు పాళ్యంలో తొలి వంద కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది. ఈ సందర్భంగా కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఫిబ్రవరి 11 జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కత్తరపల్లిలో 200 కిలోమీటర్లు చేరుకున్న పాదయాత్రలో మరో శిలాఫలకాన్ని ఏర్పాుట చేశారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో మహిళా డిగ్రీకళాశాలను ఏర్పాటు చేస్తామని హామీని అందులో రాసి పెట్టారు. 
పాదయాత్ర ప్రారంభమైన 23 రోజు నాటికి మూడు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  ఫిబ్రవరి 21న శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చివ వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. 

మార్చి 1నాటికి యువగళం పాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్లు  పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో కూడిన 10 పడక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శిలాఫలకం వేశారు. 
39వ రోజు మదనపల్లి శివారు చినతిప్ప సముద్రంలో పాదయాత్ర 500 వ రోజుకు చేరుకున్న వేళ మదనపల్లిలో టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్టోరేజీ ఏర్పాటుకు శిలాఫలకం ఏర్పాటు చేశారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లా 

47వ రోజు కదిరి నియోజకవర్గం చిన్నయ్య గారి పల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది యాత్ర. ఈ సందర్భంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 

పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్లు మైలురాయిని అందుకుంది పాదయాత్ర. గోరంట్ల, మడకశిర ప్రాంతాల్లో తాగు, సాగునీటి కమస్య తీర్చేందుకు హంద్రీనీవా కాల్వ ఎత్తిపోతల పథకం నిర్మిస్తామన్నారు. 

63వ రోజు నాటికి 800 కిలోమీటర్ల మైలు రాయిని అందుకుంది పాదయాత్ర. శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు యువనేత శిలఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా 
యువగళం పాదయాత్ర 70వ రోజు నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం అవిష్కరించారు. 

ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలోమీటర్ల  మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్‌ 21ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీరు సహా మౌలిక వసతుల కల్పనకు ఆవిష్కరించారు. 
1100 కి.మీ.- ఎమ్మిగనూరులో 10 వేల మందికి ఉపాధి కల్పించే టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని శిలాఫలకం ఏర్పాటు చేశారు. 
1200 కి.మీ.-నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో శిలాఫలకం- మిడుతూరు ఎత్తిపోతల పథకానికి హామీ 
1300కి.మీ. - నంద్యాలలో శిలాఫలకం- పసుపు మార్కెట్, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటుకు హామీ 

ఉమ్మడి కడప జిల్లా
1400 కి.మీ. - జమ్మల మడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద శిలాఫలకం- గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే పరిశ్రమ ఏర్పాటుకు హామీ 

1500 కి.మి. కడప అసెంబ్లీ నియోజకవర్గం ఆలంఖాన్‌పల్లె- కడపలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి హామీ ఇస్తూ శిలాఫలకం

ఉమ్మడి నెల్లూరు జిల్లా

1600 కి.మి- ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద శిలాఫలకం. హార్టికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు హామీ 

1700కి.మి-వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో శిలాఫలకం- ఆప్కో హ్యాండ్‌లూమ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ 

1800కి.మి. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద శిలాఫలకం- ఆక్వారైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు హామీ 

1900కి.మి. కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో శిలాఫలకం- రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుోకవడానికి కోవూరు వద్ద ప్లాట్‌ఫారాలు ఏర్పాటుకు హామీ 

2000 కి.మి. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద శిలాఫలకం- కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్‌ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ 

ఉమ్మడి ప్రకాశం జిల్లా 
2100 కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అజీస్‌పురంవద్ద శిలాఫలకం- సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం, ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత మంచినీరు ఇచ్చేందుకు హామీ 

2200 కి.మి. ఒంగోలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలఫకం ఏర్పాటు 
ఉమ్మడి గుంటూరు జిల్లా 

2300 కి.మి. వినుకొండ నియోజకోవర్గం కొండ్రముట్ల వద్ద శిలాఫలకం- వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తికి హామీ. 

2400 కి.మి. పెద్దకూరపాడు నియోజకవర్గం దొడ్లేరు వద్ద శిలాఫలకం. ఎత్తిపోతల పథకానికి హామీ 

2500 కి.మి. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి వద్ద శిలాఫలకం. పేదలకు 20 వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ. అసైన్డ్ ఇతర ప్రభుత్వ భూముల్లో నివశిస్తున్న పేదలకు క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇస్తామని బరోసా.
ఉమ్మడి కృష్ణా జిల్లా

2600 నూజివీడు నియోజకవర్గం సింహాద్రిపురం గ్రామంవద్ద శిలాఫలకం. చింతలపూడి లిఫ్‌ట్ ఇరిగేషన్ పథకం పూర్తి చేసేందుకు హామీ. రెండేళ్లలో పూర్తి చేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని హామీ. 

లోకేష్‌ ఇచ్చిన ఇతర హామీలు

యువతకు ఇచ్చిన హామీలు 
*కెరియర్‌ కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు 
*ఏటా జనవరిలో జాబ్ కేలండర్‌
* ప్రతి సంవత్సరం డీఎస్సీ
* ప్రైవేటు జాబ్‌ల కోసం జాబ్‌మేళాలు 
*యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టో 
*జీవో నెంబర్‌ 77 రద్దు, పాత ఫీ రీఎంబర్స్‌మెంట్‌ విధానం 
*ఓటీఎస్‌ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత 
*వంద రోజుల్లో పెద్ద ప్రైవేటు కంపెనీలు తీసుకురావడం 
*నియోజకవర్గానికో ట్రైనింగ్ సెంటర్‌, సబ్సిడీపై రుణాలు 

మహిళలకు ఇచ్చిన హామీలు 
*మహాశక్తి పథకం అమలు 
*మహిళలను గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు
*మహిళల రక్షణకు ప్రత్యేక విధానం 
* అభయ హస్తం పునరుద్దరణ 

రైతులకు ఇచ్చిన హామీలు 
*నాణ్యమైన ఎరువులు, విత్తనాలు 
*సీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ
*పంటలకు గిట్టుబాటు ధర 
*కౌలు రైతులకు ప్రత్యేక చట్టంతో సాయం 
*టమాటా రైతులకు గిట్టుబాటు ధర 
*ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు 
*పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి 
*చిన్న, సన్నకారుల రైతులకు సబ్సిడీ రుణాలు
*సాగును నరేగాకు అనుసంబంధానం 
*అన్ని పంటలకు స్థానికంమగా మార్కెటింగ్ సౌకర్యం 
*వంద రోజుల్లో టమాటా రైతులకు జాక్‌పాట్‌ విధానం రద్దు 
* మదనపల్లిలో కచప్‌ ఫ్యాక్టరీ , కోల్ట్ స్టోరేజీలు
*మామిడి రీసెర్చ్ సెంటర్‌, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు 
*నూజివీడు రీసెర్చ్ సెంటర్ బలోపేతం 

దళితులకు ఇచ్చిన హామీలు 
*గత సంక్షేమ పథకాల పునరుద్ధరణ
*అక్రమ కేసులు మాఫీ
*నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్లు 
*వర్గీకరణ విషయంలో మాదిగులకు న్యాయం 
*అమరావతిలో బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం

ఎస్టీలకు హామీలు 
*తండాలకు సురక్షిత నీరు రోడ్ల నిర్మాణం
*ఫైబర్ నెట్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ సదుపాయం 
*తండాల్లో దేవాలయాలు 

ముస్లింలకు ఇచ్చిన హామీలు 
*ఇస్లామిక్ బ్యాంక్
*ముస్లింలకు ప్రత్యేక మ్యానిఫెస్టో 
*వక్ఫ్‌ భూములు కాపాడేందుకు జ్యుడీషియరీ అధికారం 
*మైనార్టీ బాలికులకు ప్రత్యేక కళాశాలలు
చేనేతలకు ఇచ్చిన హామీలు 
*మగ్గం నేరేవాళ్లకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్
*మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంటు 
*చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు 
*సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం 

ఇతర హామీలు 
*అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ 
*ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు 
*చంద్రన్న బీమా మొత్తం 10 లక్షలకు పెంపు 

Published at : 31 Aug 2023 12:36 PM (IST) Tags: TDP Yuvagalam Padayatra . Lokesh #tdp Lokesh Yatra @200

ఇవి కూడా చూడండి

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత, 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత, 'స్పాట్' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Top Headlines Today: వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న జగన్- తెలంగాణలో ఎంఐఎం గేమ్ ఛేంజర్ కానుందా?

Top Headlines Today: వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న జగన్- తెలంగాణలో ఎంఐఎం గేమ్ ఛేంజర్ కానుందా?

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...