News
News
X

Cheera Meenu Price: అసలు సిసలైన చీరమేను ఇది - ధర ఎంతో తెలిస్తే ఉలిక్కిపడతారు !

Record Price For Cheera Meenu: చిన్న సైజులో ఉండే చీర మేను చేప పేరు చెబితే అందరూ లొట్టలేసుకుని తింటారంటే నమ్మశక్యం కాదు. సీజనల్ చేప కావడంతో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలలో లభిస్తుంటుంది.

FOLLOW US: 
 
Konsaseema Cheera Meenu Price: గోదారోళ్లకు పులస తర్వాత అత్యంత ప్రీతిపాత్రమైనది చీరమేను. ఈ చేప రుచే వేరు. చిన్న సైజులో ఉండే చీర మేను చేప పేరు చెబితే అందరూ లొట్టలేసుకుని తింటారంటే నమ్మశక్యం కాదు. సీజనల్ చేప కావడంతో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలలో శీతాకాలం ప్రారంభం సమయంలో ఇది గోదావరి నదీ ముఖ ద్వారం వద్ద అంటే గోదావరి (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రదేశాల్లో వాటికి ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బ్రాకిస్ వాటర్ లో లభిస్తుంటుంది. చీరమేనును సోల, తవ్వ, సేరు గ్లాసు, బకెట్ కొలతల్లో అమ్ముతుంటారు. ప్రస్తుతం యానాం మార్కెట్లో లభిస్తుండడంతో మాంసాహార ప్రియులు చీర మేను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
చీర మేను రికార్డు ధర
ప్లాస్టిక్ బకెట్లో ఉన్న 15 కేజీల చీర మేను శనివారం ధర రూ.34వేలకు పలికింది. యానాం మార్కెట్ లో చేపల విక్రయించే మత్స్యకార మహిళ ఆకుల సత్యపతి రూ.30 వేలకు వేలంపాటలో దక్కించుకోగా దానిని తిరిగి అమలాపురానికి చెందిన వాకపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రూ. 34 వేలకు కొనుగోలు చేశారు. ఈ చీరమేను నదీముఖద్వారంలో లభ్యం చీరలతో పడుతుంటారు. చిట్టిగా అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలతో పట్టడం సాధ్యం కాదు కాబట్టి దీనిని చీరల సహాయంతో గోదావరి ముఖ ద్వారాల్లో మత్స్యకారులు పడుతుంటారు. 

ఆ రెండు నెలల్లోనే అధికం.. 
ముఖ్యంగా శీతాకాలం ప్రారంభంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో దసరా నుంచి దీపావళి వరకు ఈ చీరమేను వస్తుంటుంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజార్డ్ ఫిష్ జాతికి చెందినదిగా చెబుతారు. సముద్రం, నదీ కలిసే ప్రదేశం వద్ద చల్లగా వీచే తూర్పుగాలులకు నీటి అడుగుభాగంలో ఉన్న చీర మేను కాస్తా నీటి పైకి వస్తుంటుంది. గుంపులు, గుంపులుగా అధిక సంఖ్యలో వచ్చిన చీరమేను చిన్నదిగా ఉండటంతో వలలను కాకుండా మత్స్యకారులు (AP Fishermen) చీరలను ఉపయోగించి పట్టుకుని దానిని ఒడ్డుకు చేరుస్తుంటారు. చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చింది. యానాం, భైరవపాలెం తదితర ప్రాంతాల్లో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. పులస చేపల తరువాత అంత డిమాండ్ ఉన్నది చీర మేను (Demand for Cheera Meenu after Pulasa fish)కు మాత్రమే.

కూరగా, గారెలుగా...: చీరమేనును మాములు చేపల కూరలా కాకుండా ప్రత్యేకమైన పద్ధతిలో పండుతుంటారు. దీనిని చాలామంది చింతకాయ, చింతకూర వేసుకుని ఇగురు పెట్టుకుంటారు. అంతేకాకుండా గారెలుగా వేసుకుని ఎక్కువగా తింటుంటారు. ఇలా వివిధ రకాలుగా చీరమేనును ప్రైగా సైతం చేసుకుని వండుకుంటారు.

శాస్త్రీయంగా (Gracile lizardfish) సారిడా గ్రాసిలిస్‌, టంబిల్‌, ఆండోస్క్వామిస్‌ జాతులకు చెందిన పిల్ల చేపల్నే చీరమీనుగా పిలుస్తారు గోదావరీవాసులు. సముద్రనీరూ, గోదావరీ జలాలూ కలిసే బురదనీటి మడుగుల్లో - అంటే మడ అడవులు ఎక్కువగా పెరిగే ఆ నీళ్లలో ఆక్సిజన్‌ సమృద్ధిగా ఉండటంతో ఆ జాతులకు చెందిన చేపలు అక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. సముద్రంమీద తూర్పుగాలులు వీచగానే ఆ బురదనీటిలోని గుడ్లన్నీ పిల్లలుగా మారి ఒక్కసారిగా గోదావరీ జలాల్లోకి ఈదుకొస్తాయి. 

News Reels

Published at : 02 Oct 2022 11:50 AM (IST) Tags: godavari Fish Konaseema District Cheera Menu Cheera Menu Price Cheera Meenu

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Eluru District News: పైప్ లైన్ కోసం భూమిని తవ్వితే బంగారం పడింది

Eluru District News: పైప్ లైన్ కోసం భూమిని తవ్వితే బంగారం పడింది

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

Weather Latest Update: ఏపీకి వాయు గండం- పొంచి ఉన్న తుపాను ముప్పు!

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది