అన్వేషించండి

Konaseema Crime News: అలాంటి మగాళ్లే ఆమె టార్గెట్‌.. నిత్య‌పెళ్లి కూతురు మోసాలు వింటే షాకవుతారు!

Konaseema News | నిత్య పెళ్లి కూతురుపై అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.. విడాకులు తీసుకుని డిఫ్రెష‌న్‌లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని ఉన్న‌దంతా దోచుకుంటుంది.

పెళ్ల‌యి విడాకులు తీసుకున్నారా.. లేదా వివాహం కాలేద‌న్న డిఫ్రెష‌న్లో ఉన్నారా.. అయితే మీకు ఫోన్ ద్వారా కానీ, ఎవ‌రైనా పెళ్లిళ్ల బ్రోక‌ర్ల ద్వారా కానీ మీకు చ‌క్క‌ని అమ్మాయి ఉంది.. చాలా మంచిది.. చాలా అందంగా ఉంటుంది.. అంటూ చెబితే మీరు అమ్మాయి ఫోటోచూసి ఉబ్బిత‌బ్బిబ్య‌య్యి పోకండి.. ఇలా చాలా మందే ఇలా మోస‌పోయారు.. ఈ విష‌యం ఎవ‌రో చెబితే పెద్ద విష‌యం కాదు కానీ స్వ‌యంగా మోస‌పోయిన బాధితులే బాబోయ్ ఈ నిత్య పెళ్లి కూతురు వ‌ల‌లో ప‌డి మోస‌పోయామ‌ని ఏకంగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేశారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు 

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఎస్సీ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన‌ గ్రీవెన్స్ కు నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు  బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

నిత్య‌పెళ్లికూతురు మోసాలు ఇవే..

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నార‌ని ఇటీవ‌లే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కేసు న‌మోద‌య్యింది.. అయితే ఈ కేసు విష‌యంలో న్యాయం కోరుతూ  నిత్య పెళ్లికూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణరావుకు బాధితులు సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

త‌మ లాంటి వారిని మోసం చేసి 12 పెళ్లిళ్లు చేసుకుంద‌ని,  ఆ త‌రువాత త‌మ వ‌ద్ద మొత్తం డ‌బ్బు,బంగారం లాగేసి ఆపై సెక్షన్ 498 కేసులు పెట్టి వేధిస్తోంద‌ని వారంతా జిల్లా ఎస్పీ వ‌ద్ద వాపోయారు..  ఈ నిత్య పెళ్లికూతురు వ‌ల‌లో ప‌డి మోస‌పోయిన త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు ఎస్పీకు విజ్ఞ‌ప్తి చేశారు..

విడాకులు తీసుకుని డిఫ్రెష‌న్‌లో ఉన్న‌వారే టార్గెట్‌..

వైవాహిక జీవితంలో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చో లేక మ‌రే కార‌ణం చేత‌నైనా విడిపోతే వారిలో చాలా మంది డిఫ్రెష‌న్‌లోకి వెళ్లిపోయి మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతుంటారు.. స‌రిగ్గా ఈ నిత్య పెళ్లికూతురుకు వీళ్లే టార్గెట్‌గా మారుతున్నార‌ని బాధితులు వాపోయారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వివాహం వరకు తీసుకువెళతారని, ఈ లోపు వారి నుండి అందినకాడికి డబ్బును దోచుకుని, బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారని బాధితులు గొల్లు మ‌న్నారు.. 

ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్న బాధితులు..

ఇటీవల నిత్య పెళ్ళి కూతురు బేతి వీర దుర్గా నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు  బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ‌య‌టకు వ‌చ్చ‌ని వారు చాలా త‌క్కువేన‌ని, ప‌రువు కోసం చాలా మంది బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో నిత్య‌పెళ్లికూతురు, ఆమె కుటుంబం ఇదే ప‌నిగా పెట్టుకుని ఎంతో మంది జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని వారు వాపోయారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget