అన్వేషించండి

Konaseema Boat Stuck: గోదావరిలో 7 కి.మీ. కొట్టుకుపోయిన పడవ, అందులో 15 మంది రైతులు

లంకలో ఉన్న పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 15 మంది రైతుల పడవ ఆగిపోయింది. సుమారు 7 కిలోమీటర్లు పడవ కొట్టుకుపోయింది. కోటిపల్లి నుండి ఇంజన్ బోట్లను తెప్పించి అధికారులు రైతులను కాపాడారు.

గోదావరి నది మధ్యలో పడవ ఆగిపోవడం వల్ల అది కొట్టుకుపోయి ఏకంగా అందులో ఉన్న 15 మంది వరకు ఉన్న పాడి రైతులు గల్లంతయ్యారు. ఈ పడవ దాదాపు 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ద్వారా అధికారులు ఈ విషయం తెలుసుకొని ఇంజిన్ బోట్ల సాయంతో సురక్షితంగా రక్షించారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంకకు చెందిన పాడి రైతులు లంకలో ఉండే పశువులను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజన్ పడవపై 15 మంది రైతులు కలిసి వెళ్లారు.

లంకలో ఉన్న పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 15 మంది రైతులు పశువులు తీసుకువస్తుండగా గోదావరి మధ్యలో పడవ ఆగిపోయింది. నిన్న సాయంత్రం ఈ ఘటన  జరిగింది. గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు దాదాపు యానాం వద్ద మసకపల్లి వరకు పడవ కొట్టుకుపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుండి ఇంజన్ బోట్లను తెప్పించి వాటి సాయంతో అధికారులు రైతులను కాపాడారు. వారు సురక్షితంగా బయట పడటంతో రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలవరం వద్ద ఉప్పొంగిన గోదావరి
ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్ల నుండి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. లోయర్ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ముంపునకు గురైంది. పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది. దీంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి. బలహీనంగా ఉన్న గోదావరి కథలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

భద్రాచలం వద్ద ఇలా

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద సాయంత్రం 4 గంటలకు గోదావరి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అత్యవసర సేవలకు కలెక్టర్ కార్యాలయపు కంట్రోల్ రూమ్ 08744-241950, వాట్సప్ నంబర్ 9392929743, ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, వాట్సప్ నంబర్   9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743232444, వాట్సప్ నంబర్ 6302485393 ద్వారా అత్యవసర సేవలు పొందాలని ఆయన చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget