(Source: ECI/ABP News/ABP Majha)
Kakinada Bengal Tigers: 10 రోజులుగా బెంగాల్ టైగర్స్ సైలెంట్ - జాడ తెలియక పెరుగుతున్న భయాలు
గత పదిరోజులుగా పూర్తిగా నిశ్శబ్ధం. పులుల అలజడితో అల్లాడిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది. అడవిలో సంచరిస్తున్న బెంగాల్ టైగర్స్ మాత్రం పది రోజులుగా జాడలేకుండా పోయాయి.
రెండు జిల్లాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది ఒక బెంగాల్ టైగర్. అడుగు పెట్టిన చోటల్లా హడ లెత్తిపోయేలా చేసింది మరొకటి. అయితే గత పదిరోజులుగా పూర్తిగా నిశ్శబ్ధం. అడుగుల జాడ కూడా లేనంత నిశ్శబ్ధం. పులుల అలజడితో అల్లాడిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతకీ కొన్ని రోజులపాటు వ్రత మాచరిస్తున్నట్లు బెంగాల్ టైగర్స్ మడికట్టుకుని కూర్చున్నాయా.? లేక ప్రతికూల పరిస్థితుల్లో ప్రతిఫలం ఆశించక నెమ్మదించాయా. తెరుపివ్వని వర్షాలు. ఏమాత్రం అనుకూలించని వాతావరణం.. మరోవైపు యంత్రాంగం అప్రమత్తమైంది. వారి హెచ్చరికలకు రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అడవిలో సంచరిస్తున్న బెంగాల్ టైగర్స్ మాత్రం పది రోజులుగా జాడలేకుండా పోయాయి.
కాకినాడ, విశాఖ జిల్లాలను గడగడలాడించిన రాయల్ బెంగాల్ టైగర్. మరో వైపు విజయనగరం జిల్లా ను వణికించిన పెద్దపులి ఒకటి కాదు రెండని ఎప్పుడో తేలిపోయింది. దీంతో ఈరెండు పెద్దపులులు సంచరిస్తున్న ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఎదురుబొదురుగా ప్రయాణం చేస్తూ అవి నడయాడే ప్రతీ ప్రాంతంలోనూ పశువులపై దాడులు చేస్తూ స్థానిక ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అనకాపల్లిలో ఓ ఆవుపై దాడిచేసిందని తెలుసే లోపే విజయనగరంలో పాడి గేదెను చంపితిందని మరో వార్త వినిపించేది. అయితే గత పది రోజులుగా వీటి జాడ ఏమాత్రం తెలియకుండా పోయింది. కొన్నిచోట్ల మనుషులపై దాడి చేసిందనే ప్రచారం సైతం జరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
పూర్తిగా రిజర్వు ఫారెస్ట్ లోనే మకాం.!
పెద్ద పులులు రెండూ అసలు ఎక్కడున్నాయో అన్నది అటవీశాఖ అధికారులు కూడా కనిపెట్టలేనంతగా పరిస్థితి మారిపోయింది. ఈ రెండు పెద్దపులులు పూర్తిగా రిజర్వుడ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న గ్రామాల్లోనే సంచరించగా ఎక్కడో ఒకచోట పశువులపై దాడులకు పాల్పడిన సందర్భాల్లోనే వాటి జాడ బయటపడేది. అయితే కొన్ని రోజులుగా పులుల అలికిడి కనిపించకపోవడంతో ఇవి రెండూ కలుసుకున్నాయా. లేక కలుసుకునేందుకు పూర్తిగా రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లిపోయాయా అన్నది సందేహాలు రేకెత్తిస్తోంది.
ఆహారం సమృద్ధిగా ఉంటే బయటికి రావు..
రిజర్వు ఫారెస్ట్ లో సంచరిస్తున్న ఈ పెద్దపులులకు కావాల్సినంత ఆహారం ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో అక్కడ వేటాడడం మానేసి సమీపంలో ఉన్న గ్రామాలపైకి ఎందుకు వస్తుందని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పెద్దపులి కేవలం ఆహారం కోసమే పశువులపై విరుచుకుపడుతుందని, అడవిలో దానికి కావాల్సిన ఆహారం దొరుకుతున్నంత వరకు అది అడవిని వదిలి గ్రామాలలోకి వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
భారీ వర్షాలు మరో కారణం..
గత కొన్ని రోజులుగా ప్రతీ రోజూ భారీ వర్షాలు కురుస్తుండడం కూడా ఫారెస్ట్ ను వదిలి గ్రామాల్లోకి రాకపోవడానికి మరోకారణంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలని జలమయం అవ్వడం. నేల పూర్తిగా చిత్తడిగా మారడం పెద్దపురులు సంచరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండదని అందుకనే కిందకు రావడంలేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్దపులల జాడ పదిరోజులుగా లేకపోగా రిజర్వు ఫారెస్ట్ ను అనుకుని ఉన్న పులి ప్రభావిత గ్రామాల్లో మాత్రం రైతులు, ప్రజలు కాస్త ఊపిరి పీలు కుంటున్నారు. ఇక అటవీశాఖ అధికారులైతే హమ్మయ్య అనే పరిస్థితికి వచ్చారు..