అన్వేషించండి

Janasena Plenary 2025: ఒక్కరోజే జనసేన ప్లేనరీ - జనసైనికులను నిరాశ పరిచిన నిర్ణయం!

Janasena Plenary Latest News: పిఠాపురం జనసేన ప్లేనరీతో మరింత ఉత్సాహం వస్తందని ఎదురు చూసిన జనసైనికులకు కాస్త నిరాశ ఎదురైంది. మూడు రోజుల పండగ కాస్త ఒక్క రోజుకు పరిమితమైంది.

Pawan Kalyan Latest News:జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి రాజకీయ పార్టీలు. పవన్ కల్యాణ్ లాంటి విపరీతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు తన పార్టీకి ప్లీనరీ ఏర్పాటు చేస్తే ఆయన అభిమానులకు కార్యకర్తలకు ఎంతటి ఉత్సాహం ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు జనసేన నేతలు, ఆయన అభిమానులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. 

పార్టీ స్థాపించిన పదేళ్లకు అధికారంలోకి వచ్చాం ప్లీనరీ ధూంధాంగా చేస్తారని రెండు రాష్ట్రాల్లోని జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో అదిగో అంటూ చాలా కాలం నుంచి వారిని ఊరిస్తూ వచ్చిన పార్టీ చివరకు విషయాన్ని చాలా కూల్‌గా చెప్పేసింది. ఈసారి పవన్ కల్యాణ్‌ సొంత నియోజకవర్గంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారని పేర్కొంది. అయితే అందులో కూడా భారీ ట్విస్ట్ ఇచ్చింది జనసేన అధినాయకత్వం. కొద్ది కాలంగా ప్రచరాంలో ఉన్నట్టు మూడు రోజులు కాకుండా కేవలం ఒక్కరోజుకే ప్లీనరీని పరిమితం చేసింది. నిన్న మొన్నటి వరకు పిఠాపురంలో ఈ ప్లీనరీ మూడు రోజులు పాటు జరుగుతుంది జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై జనసేన హైకమాండ్ నీళ్లు చల్లి ఒక్క రోజుకే పరిమితం కావడంతో జన సైనికుల్లో నిరాశ కనిపిస్తోంది.

Also Read: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా

మార్చి 14న పిఠాపురంలో ఒక్కరోజే ప్లీనరీ 
అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్టీ ప్లీనరీ అందులోనూ అధినాయకుడు పవన్ కల్యాణ్‌ రికార్డు మెజారిటీతో గెలిచిన పిఠాపురంలో తొలి ప్లీనరీ. జన సైనికులు ఆనందంతో ఉప్పొంగిపోవడానికి ఈ ప్రకటన చాలు. మొదట్లో దానికి అనుగుణంగానే మూడు రోజులపాటు అంటే మార్చి 12 నుంచి 14 వరకు ప్లీనరీ జరుగుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ ప్రతినిధులతో సమావేశం, శ్రేణులకు దిశా నిర్దేశం జరిగిపోయింది. జన సైనికులను ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభ అందులో పవన్ ప్రసంగం ఇలా పక్కా ప్లాన్‌తో మూడు రోజుల పాటు ప్లీనరీ సంబరం జరుగుతుందని అంతా భావించారు. ఈవిషయాన్ని జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్ సహా ఇతర కీలక నేతలు జనవరిలోనే ప్రకటించారు. 

కాని సడన్‌గా ప్లీనరీ ఒక్కరోజే జరుగుతుందని జనసేన నుంచి ప్రకటన వెలువడింది. పార్టీ ఆవిర్భవించిన మార్చి 14 బహిరంగ సభ ఉంటుందని ప్రస్తుతానికి స్పష్టత వచ్చింది. పార్టీ ప్రతినిధుల సమావేశం అదే రోజు ఉదయం పూట జరుగుతుందా లేక అది రద్దు అవుతుందా అని దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు.

పవన్ అనారోగ్యమే కారణమా?
ఇటీవల పవన్ కల్యాణ్ అస్వస్థతకు లోనైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌కి ఆయన అటెండ్ కాలేదు. అలాగే "జనంలోకి జనసేన" కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన లేదు. ప్రస్తుతానికి ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజిగా ఉంటున్నారు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం లేదని సమాచారం. ఒకవేళ ఇదే కారణమా లేక మరేదైనా ఆలోచనో తెలియదు. కానీ మూడు రోజులు జరుగుతుందని చెప్పిన ప్లీనరీ ఒక్క రోజుకే పరిమితం కావడం మాత్రం తమ అధినాయకుడు మూడు రోజులు పాటు తమతోనే ఉంటాడు అని భావించిన జన సైనికులకు కాస్త నిరాశ కలిగించే అంశమే.

Also Read: సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget