అన్వేషించండి

Godavari Cheeramenu: చీరతో పట్టేసే చేప పిల్లలకు భలే డిమాండ్! చీరమేను రుచి కోసం ఎగబడతారు..

గోదావ‌రిలో ల‌భ్య‌మ‌య్యే చీర‌మేను భ‌లే డిమాండ్ ఉంటుంది.. సీజ‌న్ కావ‌డంతో చీర‌మేను కోసం ఎగ‌బ‌డుతున్నారు నాన్ విజిటేరియ‌న్స్‌.. ధ‌ర కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది మ‌రి..

గోదావ‌రి జిల్లాలో పుల‌స‌కు ఉన్న క్రేజ్ ఎంటో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. కానీ ఇంచుమించు ఈ సీజ‌న్‌లో అంతే క్రేజ్ ఉన్న గోదావ‌రి వంట‌కం చీర‌మేను..చీర‌తో వేటాడే ఈ చేప‌పిల్ల‌ల టేస్ట్ గురించి మాంస ప్రియులు చాలా గొప్ప‌గా చెబుతారు.. గోదావ‌రిలో ల‌భ్య‌మ‌య్యే ఈ చీర‌మేను రేటు కూడా అంతే స్థాయిలో కూడా ఉంటుంది.. ఎందుకంటే ఇది అరుదుగా దొరికే సీజ‌న‌ల్ చీర‌మేను కావ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా.. పూర్వ కాలంలో శేరు, త‌వ్వ‌, సోల కింద కొలిచి అమ్మే ఈ చీర‌మేను ఇప్ప‌డు కిలోల లెక్క‌న అమ్మ‌కాలు సాగిస్తున్నారు.. ఒక కిలో చీర‌మేను రూ.3000 నుంచి రూ.4000 వ‌ర‌కు విక్ర‌యాలు జ‌రుగుతుండ‌గా పావుకిలో చొప్పున కూడా అమ్మ‌కాలు చేస్తుంటారు స్థానికంగా ఉన్న మ‌త్స్య‌కారులు.. తాజాగా చీర‌మేను సీజ‌న్ కావ‌డంతో పుదుచ్చేరీ యానం మార్కెట్‌లో చీర‌మేను ను కొనేందుకు ఎగ‌బ‌డుతున్నారు నాన్ విజిటేరియ‌న్స్‌...

అస‌లు చీర‌మేను అంటే తెలుసా...

గోదావ‌రిలో సెప్టెంబ‌రు, అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో చీర‌మేను అరుదుగా దొరుకుతుంది కాబ‌ట్టే దీనికి ఇంత ధ‌ర ప‌లుకుతుందంటుంటారు చీర‌మేను గురించి తెలిసిన వారు.. గోదావ‌రి ప్ర‌వాహం ఓ వైపు, గోదావ‌రిపై వీచే శీత‌ల చ‌ల్ల‌గాలులు మ‌రోవైపు ఈ ప్ర‌భావానికి దొందు జాతికి చెందిన చేప‌పిల్ల‌లు స‌మూహంగా నీటి ఉప‌రిత‌లంపై నుర‌గ‌లా తేలుతూ క‌దులుతుంటాయి.. నీటి అల‌ల తాకిడికి నుర‌గ కూడా తోడ‌వ్వ‌డంతో ఈస‌మాహాన్ని గుర్తించ‌డం మ‌త్స్య‌కారుల‌కు చాలా తేలిక అవుతుంది.


Godavari Cheeramenu: చీరతో పట్టేసే చేప పిల్లలకు భలే డిమాండ్! చీరమేను రుచి కోసం ఎగబడతారు..

ఈ స‌మూహం క‌ద‌లిక‌ను ముగ్గురు క‌లిసి చీర‌తో అడ్డుకుని ప‌ట్టుకుంటారు.. ఇది గ‌ట్టుపైకి తీసుకువ‌చ్చి నీళ్ల‌ల్లో క‌డిగి బ‌కెట్ల‌లో ఉంచుతారు.. వ‌ల‌కు చిక్క‌ని చిన్న చేప‌పిల్ల‌లు కావ‌డం, స‌మూహంగా క‌ద‌ల‌డంతో వ‌ల‌కు చిక్క‌వు గ‌నుక ఈ చేప‌పిల్ల‌ల‌ను చీర‌తో మాత్ర‌మే ప‌ట్టుకునేందుకు వీల‌వుతుంది.. అందుకే వీటికి చీర‌మేను అనే పేరు వ‌చ్చిందంటారు.. అయితే ఇప్ప‌డు సీడ్ నెట్ అందుబాటులో ఉండ‌డంతో వీటితోనే చీర‌మేనును ప‌ట్టుకుంటున్నారు.


Godavari Cheeramenu: చీరతో పట్టేసే చేప పిల్లలకు భలే డిమాండ్! చీరమేను రుచి కోసం ఎగబడతారు.. 

ఈ రెసిపీలో తింటే ఆ రుచే వేర‌బ్బా...

గోదావ‌రిలో అరుదుగా దొరికే ఈ సీజ‌న‌ల్ చీర‌మేను కోసం మాంస ప్రియులు ఎందుకు అంతగా ఎగ‌బ‌డ‌తారు అంటే వీటితో చేసిన వంట‌కాలు అంత రుచిగా ఉంటాయ‌ని చెబుతుంటారు.. చీర‌మేను చింత‌కాయ పులుసు,  చీర‌మేను మ‌సాలా కూర‌, చీర‌మేనుతో క‌లిపి వేసిన‌ గారెలు అబ్బో ఆ టేస్టే వేరే లెవెల్ అంటుంటారు గోదావ‌రి ప్ర‌జ‌లు.. ప్ర‌స్తుతం చీరమేను యానాం చేప‌ల‌మార్కెట్‌లో దొరుకుతోంది.. ధ‌వ‌ళేశ్వ‌రం, అంత‌ర్వేది, ఓడ‌ల‌రేవు ఇలా చాలా ప్రాంతాల్లో ఈ చీర‌మేను ల‌భ్యం అవుతోంది.. కొంత‌మంది కిలోల లెక్క‌న విక్ర‌యాలు చేస్తుండ‌గా కొంత మంది కొల‌తల ప్ర‌కారం అంటే శేరు, తవ్వ‌, సోల ప్ర‌కారం కొలిచి అమ్ముతున్నారు. ఇక రోజూ జ‌రిగే యానాం చేప‌ల మార్కెట్‌లో  నిర్వ‌హించే వేలంపాట‌లో ఓ బ‌కెట్ చీర‌మేను రూ.26 వేలు నుంచి రూ.28 వేలు వ‌ర‌కు  ధ‌ర ప‌లుకుతుండ‌డం విశేషం.. ఇక్క‌డి నుంచి విదేశాల‌కు సైతం ప్యాక్‌చేయించుకుని తీసుకెళ్తున్నారు మాంస ప్రియులు.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను కలిసిన ప్రొడ్యూసర్స్ - సింగిల్ స్క్రీన్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూపై...
పవన్ కల్యాణ్‌ను కలిసిన ప్రొడ్యూసర్స్ - సింగిల్ స్క్రీన్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూపై...
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget