East Godavari News: శివపార్వతలు భారీ సైకత శిల్పం, భారీగా తరలివస్తున్న భక్తులు!
East Godavari News: తూర్పు గోదావరికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు 16 గంటల పాటు శ్రమించి శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
East Godavari News: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వినాయకుడి గుడి దగ్గర కార్తీక మాసం సంద్భర్బం గా శివ పార్వతుల భారీ శైకిత శిల్పాన్ని రూపొందించారు. రంగంపేట గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు 108 సైకత లింగాల మధ్య సుమారు 30 అడుగుల వెడల్పుతో శివపార్వతుల భారీ సైకన శిల్పాన్ని తయారు చేశారు. 16 గంటల పాటు శ్రమించి భక్తి, శ్రద్ధలతో చేసిన ఆ దేవుళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రంగం పేట గ్రామానికి చెందిన సొహిత, ధన్యత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు రూపొందించారు. ఆరు యూనిట్ల ఇసుకతో చేపట్టిన శివ పార్వతుల సైకత శిల్పాన్ని చూసేందుకు భక్తులు భారీగా చేరుకుని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించిన అక్కాచెల్లెళ్లను పలువురు అభినందించారు.
"నా పేరు సోహిత. మా చెల్లి పేరు ధన్యత. మా నాన్న మేము కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం అనే నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం." - సోహిత
"ఈరోజు రాజనగరంలో జరగబోయే అయ్యప్ప పడిపూజ సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం." - ధన్యత
గతంలో అత్యాచార ఘటనపై కూడా ఈ అక్కాచెల్లెళ్లు..
తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పం ఆకర్షిస్తుంది. ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత దీన్ని రూపొందించారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా సైకత శిల్పం ఏర్పాటు చేశారు. పసలేని చట్టాలే మాకు శాపాలు.. ఆడపిల్లగా పుట్టడమే పాపమా..? అనే నినాదాలతో సైకత శిల్పం ఉంది. దోషిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వారు ఈ వినూత్న నిరసన చేశారు.