By: ABP Desam | Updated at : 21 Apr 2022 02:36 PM (IST)
పరిశ్రమను ప్రారంభిస్తున్న సీఎం జగన్
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ కోర్ ఆల్కలీ యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి దీన్ని గురువారం సీఎం ప్రారంభించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని, వారిపై ఆ కేసులు అన్నింటినీ ఎత్తివేస్తున్నామని జగన్ ప్రకటించారు. దానికి సంబంధించి ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ గ్రాసిమ్ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం జగన్ అన్నారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశామని గుర్తు చేశారు.
Hon’ble CM of AP will be Inaugurating Grasim Industries - Caustic Soda Plant at Balabhadrapuram#YSJaganInauguratesGrasim#InvestInAP #BuildAP#YSJaganCares pic.twitter.com/vCLEZ0yKjP
— YSJaganCares (@JaganCares) April 21, 2022
ఈ గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ప్రత్యక్షంగా 1,300 మంది, పరోక్షంగా 1,150 మందికి అవకాశం లభిస్తుందని.. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఆ కంపెనీలో 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చూస్తామని అన్నారు. గత ఎన్నికలకు 2 నెలల ముందు ప్రభుత్వం గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించిందని.. సమస్యలు పరిష్కారం కాకుండానే గత ప్రభుత్వం సంతకాలు చేసిందని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా తాము చేశామని అన్నారు. అవరోధాలను పక్కకు జరిపి ప్రాజెక్టు నెలకొల్పామని చెప్పారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతో పరిశ్రమ ఏర్పాటు చేశారని వివరించారు. టెక్నాలజీ మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ చేశారని వివరించారు. భయాలకు తావు లేకుండా ప్రాజెక్టు నెలకొల్పారని సీఎం అన్నారు.
ప్రభుత్వ సహకారం చాలా బాగుంది: కుమార మంగళం
బిర్లా గ్రూప్ కు చెందిన గ్రాసిమ్ పరిశ్రమ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం సందర్భంగా ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కూడా మాట్లాడారు. తమ పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,500 మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ సహకారం మరవలేనిదని కొనియాడారు.
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ
YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!