అన్వేషించండి

Case Filed against RGV: రాజమండ్రిలో ఆర్జీవీపై కేసు, యాంకర్ స్వప్న కూడా ఇరుక్కున్నారు! అసలు కారణం ఏంటి?

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై రాజ‌మండ్రిలో కేసు న‌మోద‌య్యింది.. ఆర్జీవీ, యాంక‌ర్ స్వ‌ప్న‌పైన‌ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేశారు పోలీసులు.

రామ్‌గోపాల్ వ‌ర్మ అన‌గానే సంచ‌ల‌నం.. లేదా వివాద‌స్ప‌దం.. ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌గా ఎవ్వ‌రిని అడిగినా ఇదే చెబుతారు.. ఓ డిజిట‌ల్ ఛానెల్‌లో యాంక‌ర్ స్వ‌ప్న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వూ ఇప్ప‌డు వివాదం రేపుతోంది.. ఈ ఇంట‌ర్యూలో ఆర్జీవీ హిందూ దేవుళ్ల‌పైన, ఇండియ‌న్‌ ఆర్మీ పైనా కించ ప‌రుస్తూ మాట్లాడారంటూ దానికి ఊత‌మిచ్చే విధంగా యాంక‌ర్ స్వ‌ప్న ప్ర‌శ్న‌లు ఉన్నాయ‌ని, ఆర్జీవీ స‌మాధానాల‌కు మౌనంగా ఉన్నారంటూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంకు చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రాజ‌మండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

వీడియో ఆధారంగా ఫిర్యాదు..

రాము ఇజం పేరుతో ఓ డిజిట‌ల్ ఛానెల్‌లో యాంక‌ర్ స్వ‌ప్న రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో చాలా ఇంట‌ర్వ్యూలు చేసింది.. ఇందులో ప‌లు ఇంట‌ర్వూల‌లో భార‌తీయ హిందూ ఇతిహాసాలు మ‌హాభార‌తం, రామాయ‌ణం త‌దిత‌ర అంశాల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ చాలా సంద‌ర్భాలు చెబుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అదేవిధంగా ఇండియ‌న్ ఆర్మీ, ఆంధ్రులను కించ ప‌రిచేవిధంగా ఆయ‌న వ్యాఖ్య‌లున్నాయ‌ని రాజ‌మండ్రికి చెందిన  రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజ‌మండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాము ఇజం పేరుతో ఈ ఇంట‌ర్వ్యూ  చేసి చాలా కాలం కూడా అయ్యింది.. 

ద‌ర్శ‌కుడు ఆర్జీవీ, యాంక‌ర్ స్వ‌ప్న‌లపై కేసు నమోదు

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌త విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణ చేస్తోన్న‌టువంటి ఫిర్యాది మేడా శ్రీ‌నివాస్‌ ఇటువంటి మాటలు సమాజంలో మతపరమైన, ప్రాంతీయ విద్వేషాలను పెంచుతాయని ఫిర్యాదిలో పేర్కొన్నారు. ఇక ఇంటర్వ్యూ నిర్వహించిన యాంకర్‌గా స్వప్న మౌనంగా ఉండి, ఆ వ్యాఖ్యలకు పాలుపంచుకున్నప‌రిస్థితి ఆ ఇంట‌ర్వ్యూలో క‌నిపించింద‌ని అందుకే ఆమెపై కూడా కేసు పెట్టిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. 

ప‌లు సెక్ష‌న్ల‌ కింద కేసు న‌మోదు.. 

ఫిర్యాదు చేసిన‌ మేడా శ్రీనివాస్ ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా (ఫేస్‌బుక్, యూట్యూబ్)లో అప్‌లోడ్ అయిన ఇంటర్వ్యూ వీడియోలు, ఆటోగ్రాఫ్ పోస్టులను ఆధారాలుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా సమర్పించారు. బిఎన్ఎస్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) యాక్టు కింద కేసు నంబర్ 487/2025, సెక్షన్లు 196(1), 197(1), 353, 354, 299 (అభిప్రాయ వ్యక్తీకరణలు, మత విద్వేషాలు, పబ్లిక్ ట్రాన్క్విలిటీ డిస్టర్బెన్స్‌కు సంబంధించినవి) కింద నమోదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget