అన్వేషించండి

MLA Rapaka on Chandrababu: చంద్రబాబు, జనసేనపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు

Janasena Rebel MLA Rapaka Varaprasada Rao: ఆక్వా రైతుల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు పైన, జగనన్న కాలనీలు పై జనసేన చేస్తున్న రాద్దాంతాలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు తప్పు పట్టారు.

Janasena Rebel MLA Rapaka Varaprasada Rao: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (రాజోలు): ఓవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు.. చంద్రబాబు, జనసేన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దంటూ ఎమ్మెల్యే రాపాక హితవు పలికారు. ఆక్వా రైతుల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు పైన, జగనన్న కాలనీలు పై జనసేన చేస్తున్న రాద్దాంతాలపై రాపాక తప్పు పట్టారు. 

ఆక్వా రైతులను గత టీడీపీ ప్రభుత్వమే మోసం చేసింది 
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని.. వీలైతే ప్రజలకు సహాయం చేయాలని టీడీపీ, జనసేన పార్టీ అధ్యక్షులకు హితవు పలికారు. ఆక్వా రైతులను గత టీడీపీ ప్రభుత్వమే మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద కౌంటుకి 310, 320 ధర ఉండగా దాన్ని 180 కి తగ్గించిన పాపం మీదే అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. సీడ్, ఫీడ్ మొత్తం మీ సామాజిక, రాజకీయ వర్గాలకి చెందిన కంపెనీలే అయినందున ఆక్వా రైతులను నిండా ముంచేస్తున్నారని దుయ్యబట్టారు. 

ఆక్వా రైతులకు అండగా జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడి రూ. 1.50 కే విద్యుత్ రాయితీ, మద్దతు ధర ప్రకటించి ఆక్వా రైతులను ప్రోత్సాహిస్తున్న విషయం గుర్తెరగాలన్నారు. అలాగే జగనన్న కాలనీలపై జనసేన చేపట్టిన కార్యక్రమంపై స్పందిస్తూ ఈ పద్దతి సరైంది కాదని పరోక్షంగా జనసేన పై విమర్శలు చేశారు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకోవాలని, ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించవద్దని ఇరు పార్టీలపై చురకలు వేశారు. అనంతరం సఖినేటిపల్లి లంక గ్రామంలో గడప గడపకు తిరిగి జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీఎం జగన్ ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

కర్నూలు జిల్లాలో బిజీబిజీగా చంద్రబాబు నాయుడు 
తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక  హబ్ అయి ఉండేదని.. నిరుద్యోగం అనే మాటే ఉండేది కాదని చంద్రబాబు కర్నూలులో వ్యాఖ్యానించారు. కర్నూలు పర్యటనకు వెళ్లిన ఆయనకు ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వచ్చారు. వారితో ముఖాముఖి నిర్వహించారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ‘జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని చంద్రబాబు విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget