అన్వేషించండి

YSR Asara Scheme: పది రోజుల పాటు ఆసరా ఉత్సవాలు- అక్కచెల్లెమ్మలు అండగా ఉండాలన్న సీఎం జగన్

YSR Asara Scheme: మహిళలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. ఆసరా, చేయూత, జీరో వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామన్నారు.

YSR Asara Scheme: వివిధ పథకాలతో రాష్ట్ర మహిళలకు చేయూతనిస్తూనే దిగ్గజ సంస్థలతో కలిసి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించామన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. 

మహిళలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. ఆసరా, చేయూత, జీరో వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామన్నారు. గత పాలకుల కంటే మెరుగైన విధానాలు తీసుకొచ్చి దేశానికే పొదుపు సంఘాల మహిళలు ఆదర్సంగా నిలబెట్టామని తెలిపారు. 

పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన విధానాలను ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలిస్తున్నాయని తెలిపారు జగన్. ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారం మహిళలపై పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. 10 రోజుల పాటు ఏపీలో ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. 

ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయన్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ వాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నట్టు చెప్పారు జగన్. స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ఉంటాయన్నారు. అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం ఇప్పటి వరకు ఇచ్చామన్నారు జగన్. మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ అన్నగా ప్రభుత్వం నిలబడుతుందన్నారు. 

ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టామని... 9 లక్షల మందికిపైగా మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి ఇచ్చామని తెలిపారు. తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారన్నారు. 

2014-19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతోందన్నారు. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారని వివరించారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించామని తెలిపారు జగన్. ఇంకా తగ్గించేలా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుందని అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ఉందని గుర్తు చేశారు. 

రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారని విమర్శించారు జగన్. వారిని నిలువునా ముంచేశారని ఎద్దేవా చేశారు. 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీ రుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారన్నారు. రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సున్నావడ్డీ కింద రుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చామని తెలిపారు. 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించామన్నారు. 

ఈ 45 నెలల కాలంలో జగన్‌ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ.2,25,330.76 కోట్లు ఇచ్చామని లెక్కలు చెప్పారు. మహిళ వివక్ష మీద పోరాటం చేస్తోందీ ప్రభుత్వమని వివరించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం ఇచ్చామని తెలిపారు. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget