Amalapuram Assembly Constituency : అమలాపురం పోరు ఆసక్తికరం-ఈసారి గెలుపు బావుటా ఎవరిదో..?
Amalapuram Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం అమలాపురం. 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటిnవరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికల జరిగాయి.
Amalapuram Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లాలోని మరో నియోజకవర్గం అమలాపురం. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటిnవరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికల జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి, ఒకసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,41,994 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుష ఓటర్లు 1,20,796 మంది మహిళా ఓటర్లు 1,21,198 మంది ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు
అమలాపురం నియోజకవర్గం 1952లో ఏర్పాటు అయింది. తొలిసారి ద్వి సభకు జరిగిన ఎన్నికల్లో ఎస్పిఎఫ్ నుంచి పోటీ చేసిన బి అప్పలస్వామి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి లక్ష్మణ స్వామిపై 42,808 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేఎంపీపీ నుంచి పోటీ చేసిన ఎన్ రామభద్రిరాజు విజయం సాధించారు. ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేవీ రావుపై 52,952 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1955లో ద్విసభకు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బి అప్పలస్వామి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన ఎస్ఆర్ రావుపై 3036 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1955లో సాధారణ సభకు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జి నరసింహమూర్తి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి నారాయణదాసుపై 4645 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సూర్యనారాయణ విజయం సాధించారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కే సూర్యనారాయణ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్ రామ భద్రిరాజు పై 27 67 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1965లో జరిగిన ఎన్నికల్లో ఎన్ రామభద్రిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కే వెంకటరత్నంపై 4603 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కే ప్రభాకర్ రావు ఇక్కడ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్ రామభద్రిరాజుపై 3292 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే ప్రభాకర్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్ రామచంద్రరావుపై 9671 ఓట్లు తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన పీవీ శ్రీరామారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి నాగేశ్వరరావుపై 2408 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే ప్రభాకరరావుపై 8929 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే ప్రభాకర్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన ఆర్ రామచంద్రరావుపై 7470 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1989లో జరిగిన ఎన్నికల్లో కే ప్రభాకర్ రావు మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రావు తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన ఎమ్మెస్ నారాయణరావు పై 4273 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే ప్రభాకర్ రావు పై 16,814 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఎమ్మెస్ నారాయణరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే ప్రభాకర్ రావుపై 18,780 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కుడిపూడి చిట్టబ్బాయి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావుపై 4040 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పి విశ్వరూప్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతా కృష్ణమూర్తి పై 6273 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన ఐ ఆనందరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన జి బాబురావుపై 12,413 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పినిపే విశ్వరూప్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన ఐ ఆనందరావు పై 25,654 ఓట్ల తేడాతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ, టిడిపి మధ్య ఉండనుంది. ఇరు పార్టీలు ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన పిలుపే విశ్వరూప్ ప్రస్తుతం వైసీపీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు.