By: ABP Desam | Updated at : 01 Apr 2023 04:07 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బాధితులకు సెల్ ఫోన్ అందిస్తున్న ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి
Cell Phones Recovery : చోరీకి గురైన, పోగొట్టుకున్న 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి శనివారం ఆ ఫోన్లను బాధితులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం చాట్ బాట్( CHAT BOT) సేవలను ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున, పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నామన్నారు.
మొత్తం 220 ఫోన్స్ రికవరీ
మొదటి విడత "CHAT BOT" సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే సుమారు రూ. 22,30,500/- విలువ చేసే 120 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు వారి ఫోన్లను అందజేశామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండో విడత గా సుమారు 28 రోజుల వ్యవధిలోనే "CHAT BOT" సేవల ద్వారా సుమారు రూ.36,00,000/- విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. "CHAT BOT" సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు Rs.58,30,500/- విలువ చేసే 220 మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు.
దొరికిన ఫోన్ వాడుకోవద్దు
ఫోన్ చోరీకి గురైనా, మిస్ అయిన వారు “CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. వాట్సాప్ నంబర్ 9493206459కు HI లేదా HELP అని మెసేజీ పంపాలన్నారు. ఇలాంటి సేవలతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం పరుచుకొని పోగొట్టుకున్న మొబైల్స్ ను పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ దొరికితే సొంతానికి వాడుకోవడం కానీ, గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కాని చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. మీకు దొరికిన సెల్ ఫోన్ లను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి అందజేయాలని కోరుతున్నారు.
"సెల్ ఫోన్ రికవరీ కోసం చాట్ బాట్ సేవలు ప్రారంభించాం. గతంలో 500 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో మాగ్జిమన్ ట్రేస్ చేసి రికవరీ చేసి ఓనర్స్ కి తిరిగి ఇచ్చాం. మళ్లీ 500 కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని కూడా ఎనలైజ్ చేసి చాలా వరకు సెల్ ఫోన్లను రికవరీ చేశాం. 170 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ తిరిగి ఇచ్చాం. రూ.50 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసి వాటిని ఓనర్స్ కు తిరిగి ఇచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ ట్రేసింగ్ టీమ్ ను ఫామ్ చేశాం. వీళ్లు రెగ్యులర్ గా ఇదే పనిలో ఉండి మొబైల్స్ ట్రేస్ చేసి ఇస్తున్నాం." - ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్